శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంచైనాకి డబ్బులు ఇచ్చే ప్రశక్తే లేదు.. మనోళ్ళు తెగేసి చెప్పేశారు..

చైనాకి డబ్బులు ఇచ్చే ప్రశక్తే లేదు.. మనోళ్ళు తెగేసి చెప్పేశారు..

ప్రస్తుతం కరోనాతో దేశం మొత్తం పోరాడుతోంది అయితే ఓ పక్క పెరుగుతున్న కేసులు అలాగే మరోపక్క న్యూస్ లో వస్తున్న వార్తల నేపధ్యంలో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రతి చిన్న విషయాన్ని సామాజిక మధ్యమల్లో ప్రతేఒక్కరూ విస్తృతంగా ప్రచారం చెయ్యడంతో జనాన్ని  ఇబ్బంది పెట్టడం తప్ప మరో ప్రయోజనం లేకుండాపోతోంది.

ఇక ఈ నేపధ్యంలో కేంద్రం ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది. రాష్ట్రాల వైద్య, ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర మంత్రి హర్షవర్దన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా కిట్లు నాసిరకంగా వున్నందువాళ్ళ వాటికి డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలుకొట్టినట్లు చెప్పేశారు.

భారత్ కు  నాశిరకం కిట్లు పంపి చైనా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే తాము ఊరుకోమని చైనా దేశం మనకు పంపిన నాసిరకం కరోనా టెస్ట్ కిట్లను వారికి వెనక్కి తిప్పి పంపిస్తామని అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు హామీ ఇచ్చారు హర్షవర్దన్. ఇక ఈ చైనా కిట్ల కోసం డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని భవిషత్తులో కూడా ఆ కిట్ల తాలూకు డబ్బు చెల్లించమని సూటిగా  చెప్పారు కేంద్ర మంత్రి. అయితే మనదేశంలో లాక్‌డౌన్ చాలా రాష్ట్రాల్లో సరిగా అమలు చేయడం లేదని, యూపీ సీఎం ఆదిత్యనాద్ లాక్‌డౌన్ విషయంలో చాలా కఠినంగా ఉన్నారని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి.

బయటి  దేశాలతో పోల్చితే భారతదేశంలో  కరోనా వ్యాప్తి చాలా తక్కువగానే ఉన్నాదని అన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు మనదేశంలో చాలా త్వరగా కోలుకుంటున్నారని  కరోనా బారిన పడ్డ వారిలో రికవరీ రేటు కూడా మన దేశంలో చాలా బావుందని తెలిపారు హర్షవర్దన్. అయితే ఇక లాక్ డౌన్‌ని మరింత పటిష్టంగా పాటించడం అన్ని రాష్ట్రాల బాధ్యత అని దేశ ప్రజలందరూ దీనిపై ఒక మంచి అవగన కలిగి ఉన్నారని మరింతగా అందరూ కలిసి కరోనా మహమ్మారిపై పోరాడాలని అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పై ద్రుష్టి సారించి  మరింత కఠినంగా అమలు చెయ్యాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular