ఆదివారం, మే 26, 2024
Homeసినిమాఘనంగా హీరో నితిన్ & షాలిని ఎంగేజ్మెంట్

ఘనంగా హీరో నితిన్ & షాలిని ఎంగేజ్మెంట్

టాలివుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు వీరిలో నికిల్ పెళ్లి చేసుకోగా రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రడీగా ఉన్నాడు. తాజాగా హీరో నితిన్ ఈ నెల 26న పెళ్లి భాజాలు మోగించనున్నాడు. అయితే ఐదు సవత్సరాల ప్రేమకు గుర్తుగా ఐదు రోజుల పెళ్లి జరగనుంది దీనిలో బాగంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్ళికూతురు షాలినీ ఇంట్లోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగింది.

ఈ నెల 26న సాయంత్రం 8.30కి తాజ్ పలక్నామా పేలెస్ లో ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే తెలంగాణా సీఎం కేసిఆర్ ను ఈ పెళ్ళికి రావాలని నితిన్ ఆహ్వానించారు. వీరితో పాటు టాలివుడ్ సెలబ్రెటీస్ లో కొంత మందికే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. నితిన్ కి అంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ ఈ పెళ్ళికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం మొత్తానికి బ్యాచిలర్ లైఫ్ కి సెండాఫ్ చెప్పి మేరేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టబోతున్న నితిన్ కి ప్రజావారధి తరపున అడ్వాన్స్ హ్యాపీ మేరీడ్ లైఫ్.

 

 

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular