షాకింగ్ 2,300 కిలోల వజ్రాలు, ముత్యాలు బయట పడ్డాయ్..

0
214
nirav modi and mehul choksi
nirav modi and mehul choksi

వేలకోట్ల రూపాయల కుంభకోణమైన  మనీ లాండరింగ్‌ కేసులో నిందితులైన నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వ్యాపారస్తులకు చెందిన విలువైన వస్తువులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు స్వాధీన పరచుకున్నారు. వీళ్లకు సంబంధించిన విలువైన 2,300 కిలోల పైన పాలిష్‌ చేసిన వజ్రాలు, ముత్యాలు, వెండి తదితరాలను ఈడీ  అధికారులు బుధవారం హాంకాంగ్‌ నుంచి భారత్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.1350 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో నీరవ్‌, చోక్సీలు ఈ విలువైన వస్తువులను  దుబాయి నుంచి హాంకాంగ్‌కు తరలించి అక్కడే ఒకచోట  రహస్యంగా దాచి ఉంచారు. ఈ విషయాన్ని చాకచక్యంగా  పసిగట్టిన ఈడీ హాంకాంగ్‌తో  తరుచుగా సంప్రదింపులు జరిపి వాటిని వెనక్కు తీసుకురాగలిగారు.