ఆదివారం, జూలై 21, 2024
Homeసినిమానిధి తో పబ్జీ కి మీరు రెడీ నా.. ఆమె పబ్జీ ఐడి కావాలా…!

నిధి తో పబ్జీ కి మీరు రెడీ నా.. ఆమె పబ్జీ ఐడి కావాలా…!

లాక్ డౌన్ వేళ చిన్న పిల్లల నుండి పెద్ద వారితో సహా వీడియో గేమ్స్ కి మరియు  ఓటిటి ప్లాట్ ఫామ్ కి తెగ అలవాటు పడ్డారు. అయితే ప్రస్తుతం వీటికి ప్రత్యామ్నాయం లేక టీవీలకు మొబైల్ ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్న వారికి ఇవే టైంపాస్గా మారతానడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ మధ్య యువ‌త‌ని ఎక్కువగా ఆక‌ట్టుకున్న గేమ్ ఏదైనా ఉందంటే అది ప‌బ్‌జీ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ గేమ్ లో యువత ఎంతలా మునిగిపోయారంటే పబ్జీ మాయ‌లో చాలామంది ‌ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మరికొంతమంది సైకలాజికల్ గా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఈ గేమ్ ఒక వ్యసనంగా మారుతుండటంతో దీనికి దూరంగా ఉండాల‌ని పలువురు ప్ర‌ముఖ డాక్టర్లు కూడా హెచ్చ‌రించారు. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమిత‌మైన ఇస్మార్ట్  సెంకర్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ త‌న గదిలో కూర్చొని ట్యాబ్‌లో ప‌బ్‌జీ గేమ్ ఆడుతుండ‌గా, ఎవ‌రో షూట్ చేశారు. దీనిని నిధి తన సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే నిధి పబ్జి  ఆడుతూ తను పబ్ జీ గేమ్‌కి సంబంధించిన ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో  షేర్ చేస్తూ “అండ్ ఇట్ బిగిన్స్” అని ట్వీట్ చేసి కుర్రాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇక ఈ అందాలభామ కుర్రకారుకి నచ్చిన ఆటలోకి దిగడంతో ప్రస్తుతం కొందరు పబ్ జీ ప్రేమికులు నిధిని పబ్జీ ఐడీ ని ఇవ్వమని.

మీతో ఒక్కసారి అయినా ఆడతామని కోరారు ఇంకా ముందుకెళ్ళి క్యూ కట్టి మెసేజ్ లు కూడా చేస్తున్నారట. నిధి కి వచ్చిన ఆ మెసేజ్ లు చూసి ఎంజాయ్ చేస్తుంది ఏమో గాని తనకు మూడ్ బాగుంటే ఆ కామెంట్స్ చేస్తున్న వాళ్లలో ఎవరొకరితో ఆడుతుందేమో పబ్జి.. ఆ అదృష్టం ఎవరికి దక్కనుందో మరి.

ఇక నిధి మాత్రం ఒక వైపు జిమ్ వర్కౌట్ లతో మరియు ఆన్‌లైన్‌ ద్వారా నటనలో శిక్షణ తీసుకుంటూ బిజీగా ఉంది నిధి అగర్వాల్‌. ఇక కరోనా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోడానికి ఆమె పీఏం కేర్స్‌ మరియు సీఏం కేర్ రిలీఫ్‌ ఫండ్‌తో పాటు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సీసీసీ కి తన వంతు విరాళాన్ని అందజేసింది. ప్ర‌స్తుతం నిధి అగర్వాల్ తెలుగులో అశోక్ గ‌ల్లా స‌ర‌స‌న ఓ చిత్రంలో మరియు త‌మిళంలో జ‌యం ర‌వి స‌ర‌స‌న‌ భూమి అనే చిత్రం చేస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular