బుధవారం, జూలై 17, 2024
Homeసినిమానాని “V” మూవీ, రామ్ “RED” సినిమాలు Amazon Prime లో విడుదల

నాని “V” మూవీ, రామ్ “RED” సినిమాలు Amazon Prime లో విడుదల

టాలివుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ దిల్ రాజు దర్శకత్వంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో నాని హీరోగా త్వరలో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న  మూవీ “వి” ఇప్పుడు ఈ  సినిమా రిలీజ్ పై కొంత సమాచారం బయటకు వచ్చింది. 

తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం Amazon Prime లో ఈ సినిమా పై  35 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమాను ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ (OTT) లో   రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక  రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం లాక్ డౌన్ ఈ నెల 30 వరకూ ప్రభుత్వం పొడిగించిన సందర్భగా ఇప్పట్లో ఈ సినిమా ఉంచుమించు నెల నుండి రెండు నెలల వరకూ రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారనే  సమాచారం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

నాని నటిస్తున్న V Movie లో హీరోయిన్ గా నివేదా థామస్ నటిస్తుండగా  సుధీర్ బాబు పోలీస్ ఆ ఫీసర్ పాత్రలో కీ రోల్ పోసించనున్నాడు. ఇక ఈ సినిమాలో అదితి రావ్,  నాజర్ వంటి వాళ్ళు పలు కీలక పాత్రలు పోషించనున్నారు.  ఇక ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇక Red Cinema విసయానికొస్తే స్రవంతి రవికిశోర్ నిర్మాతగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా Amazon Prime లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రైట్స్ కోసం 20 కోట్లు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తుంది.

గతకొన్ని రోజుల క్రితం రిలీజైన రామ్ లుక్  ఫ్రెంచ్ కట్ లో స్టైలిష్ లుక్ లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే మాల్వికా శర్మ హీరోయిన్ గా చేస్తుండగా నివేదా పేతురాజ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్,  పోసాని, నాజర్,  సత్య అక్కల వంటి అత్యంత భారీ తారాగణం తో ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు  ఇక చూడాలి త్వరలో రాబోవు తెలుగు సినిమాలు కూడా ఇలాగే Amazon Prime వంటి  ఆన్లైన్ OTT సంస్థలకు అమ్ముకుని సేఫ్ జోన్ లోకి వెళ్తాయా లేక లాక్ డౌన్ తగ్గిన తరువాతనే థియేటర్ లో రిలీజ్ చేస్తాయో చూడాలి మరి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular