ఆదివారం, ఫిబ్రవరి 5, 2023
Homeజాతీయంఉద్దావ్ తాక్రే, అజిత్ పవార్ నాపై నిఘా పెట్టారంటూ సంచల కామెంట్స్ చేసిన నానా పటోల్

ఉద్దావ్ తాక్రే, అజిత్ పవార్ నాపై నిఘా పెట్టారంటూ సంచల కామెంట్స్ చేసిన నానా పటోల్

మహారాష్ట్ర ప్రభుత్వంలోని సొంత పార్టీ నేత చేసిన తాజా ఆరోపణలు రాజకీయంగా భగ్గుమంటున్నాయి. తాజాగా మహారాష్ట్రా కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ సీఎం ఉద్దావ్ తాక్రే మరియు డిప్యుటీ సీయం అజిత్ పవార్ పై నిఘా ఆరోపణలు చేసారు. తమపై రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెంట్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టారని సంచలన ఆరోపణలు చేసారు. గత కొద్ది రోజులుగా నాపై మరియు పార్టీ కార్యకర్తలపై అధిష్టానం పెద్దలు సీక్రెట్ గా గమనిస్తున్నారని విమర్సించారు.

అంతేకాక తన ఫోన్ ట్యాప్ చేసారనే అనుమానం కూడా ఉందన్నారు అంతేకాక నేను వెళ్ళే మీటింగ్ లకు సబంధించి నేను ఎవ్వరికీ తెలపని విషయాలు కూడా వారికి తెలుస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల వారికి ఇష్టం లేదన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిజాలు బయటకు తీయాలన్నారు. వచ్చే ఎన్నికలలో తాము ఒంటరిగా పోటీకి దిగితామన్నారు.

RELATED ARTICLES

Most Popular