లాక్ డౌన్ పై మరింత కఠినంగా వ్యవహరిస్తాం KCR

0
160
KCR LIVE PRESS MEET
KCR LIVE PRESS MEET

CM KCR లాక్ డౌన్ పై  మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా సరిహద్దు ప్రాంతాల్లో కొత్త కేసులు అత్యధికంగా నమోదు అవ్వడం వల్ల ఈ నెల 14 తో ముగియాల్సిన లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే కర్ణాటక, మహారాష్ట్ర మద్య రాకపోకల దృష్ట్యా  తెలంగాణా సరిహద్దు ప్రాంతాల్లో వ్యాది వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఈ నెల 30వ తేదీ వరకూ లాక్ డౌన్ పై క ఠినంగా వ్యవహరిస్తామన్నారు.

30వ తేదీ తర్వాత తీవ్రతను బట్టి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేస్తామని తెలిపారు KCR. మొదటి తరగతి మొదలు 9వ తరగతి వరకూ పరీక్షలు రద్దుచేసి పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నామనారు.

ఇక పక్కరాష్ట్రం అయిన మహారాష్ట తెలంగాణా కు విపరీతమైన సంబందాలు ఉండడం వల్ల అక్కడ వ్యాది ఉదృతి అదికంగా ఉందన్నారు. దీనితో రెండు రాష్ట్రాల బోర్డర్లు త్వరలో మూసివేసే పరిస్థితి ఉందన్నారు.

అక్కడి డాక్టర్స్ రెండు రోజుల్లో నివేదిక ఇవ్వగానే ఆ పనిని కొనసాగిస్తామన్నారు. ఇక నిత్యావసర సరుకులు కూడా బంద్ చేసి వేరే రాష్ట్రము నుండి తీసుకోక తప్పదన్నారు.