మంగళవారం, మార్చి 19, 2024
Homeహెల్త్మోకాళ్ల నొప్పిని తగ్గించుకోవటానికి ఉపయోగపడే సహజమైన ఇంటి చిట్కాలు

మోకాళ్ల నొప్పిని తగ్గించుకోవటానికి ఉపయోగపడే సహజమైన ఇంటి చిట్కాలు

ఈ రోజుల్లో సహజంగా పెద్దవాళ్లందరూ మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దానికి తగ్గ మందులను కూడా వాడుతూ ఉంటారు. అలా మందుల ద్వారానే కాకుండా కొన్ని సహజమైన హోమ్ రెమెడీస్ వరకు కూడా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

   1.వ్యాయామం:-

రోజువారీ వ్యాయామం మీ కండరాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాళ్లకు ఎక్కువ పని చెప్పకుండా రెస్ట్ ఇస్తూ ఉండాలి. అంటే ఎక్కువ బయట తిరగడం లాంటివి చేయకూడదు. ఈ రోజు వారి వ్యాయామంలో సైక్లింగ్, వాకింగ్,  స్విమ్మింగ్ ఇలాంటివి చేయొచ్చు. ఒకవేళ మీరు తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో గాని లేదా బెణుకుల తో గాని బాధపడుతున్నట్లయితే సాధ్యమైనంతవరకు వ్యాయామాలను దూరంగా ఉండాలి.

   2.వెయిట్ మానేజ్మెంట్:-

సాధ్యమైనంత వరకు మన వెయిట్ మానేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ బరువు పెరగడం వల్ల మోకాళ్ల పైన భారం పడి, మోకాళ్ళ నొప్పులు పెరిగే అవకాశం ఉంది. అందుకని బరువుని మేనేజ్ చేసుకుంటూ మోకాళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు.

   3.మూలికా వైద్యం:-

  • దాల్చిన చెక్క
  • అల్లం
  • నువ్వుల నూనె

ఇప్పుడు పైన చెప్పుకున్న వాటిని రోజూ మనం తినే ఆహారాల్లో కలుపుకొని వాడుతూ ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంది.

   4. అల్లం:-

అల్లం వల్ల మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం మందుల రూపంలో గాని, అల్లం టీ రూపంలో గాని, లేదా వంటల్లో వాడే మసాలా రూపంలో గాని తీసుకోవచ్చు. ఈ అల్లం కీళ్ల నొప్పులతో భాద పడేవాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

   5. హీట్ అండ్ కోల్డ్ థెరపీ:-

హీట్ పాడ్స్ మరియు కోల్డ్ పాడ్స్ మెడికల్ షాప్స్ లో దొరుకుతాయి. ఇవి రెండిటిని ఒకే పద్ధతిలో వాడకూడదు. మీరు హీట్ ప్యాడ్ వాడుతున్నట్లైతే,  దీన్ని రోజులో 20 నిమిషాల పాటు నొప్పి ఉన్న చోట పెట్టుకోవాలి. అదే మీరు కోల్డ్ ప్యాడ్ ను వాడుతున్నట్లైతే రోజుకు నాలుగు సార్లు 20 నిమిషాల పాటు నొప్పి ఉన్న చోట దీన్ని పెట్టుకోవాలి.

ఇలా ఇంట్లో వైద్యం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మోకాలి పై నొప్పి ఉన్న చోట డైరెక్ట్ గా ఐస్ ను ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఈ నొప్పులతో భాద పడేవాళ్ళు వేడి నీళ్ల తో స్నానం చేయాలి.

తీవ్రమైన నొప్పి మరియు వాపు,  వైకల్యం లేదా తీవ్రమైన గాయాలు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు కలిగి ఉన్నప్పుడు వైద్యుడి సలహాల తీసుకోవటం మంచిది.

పైన చెప్పుకున్నవాన్నీ ప్రయత్నించడం వల్ల తప్పక మార్పులు కనపడతాయి.ఇవ్వన్నీ ప్రయత్నిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరియు ఒకసారి వైద్యుని సలహా తీసుకోవడం చాలా మంచిది.

 

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular