మరోసారి దుమ్మురేపభోతున్న Mirzapur 2, The Family Man 2 వెబ్ సిరీస్ లు

0
280
Mirzapur 2
Mirzapur 2

ప్రపంచ వ్యాప్తంగా నేడు వెబ్ సిరీస్ ల హవా ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే హాలివుడ్ లో వీటి ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. ఇక ఈ వెబ్ సిరీస్ లను అక్కడ భారీ బడ్జెట్ తో హై క్వాలిటీ తో చాలా రిచ్ గా తెరకేక్కిస్తుండడంతో భారీ స్థాయిలో OTT లకు అమ్ముకుంటున్నారు.

ఇక భారత్ లో గత కొంతకాలంగా ఈ వెబ్ సిరీస్ ల జోరు మరింత పెరిగింది. ఒక వైపు కరోనా ప్రభావంతో ఇంట్లో కాలక్షేపం చేసేవాళ్ళకు వెబ్ సిరీస్ లు ఒక మంచి ఆప్షన్ గా మారాయి.

ఇక Mirzapur 2, The Family Man 2 రెండు వెబ్ సిరీస్ లూ త్వరలో సీజన్ -2 మొదలవ్వబోతొంది. వీటిలో ప్రదానంగా Mirzapur 2, వంటి వెబ్ సిరీస్ లు ఈ నెల 23 నుండి తిరిగి సీజన్ 2 లోకి అడుగు పెట్టభోతున్నాయి.

ఇండియాలోనే టాప్ వెబ్ సిరీస్ లలో ఒకటైన Mirzapur సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో 8.5 రేటింగ్ తో ఆకట్టుకుంటుంది. మీర్జాపూర్ పట్టణంపై ఆదిపత్యం కోసం సాగే కధ ఇది.  దీనిలో ఎక్కువగా బోల్డ్ కంటెంట్.

బోల్డ్ డైలాగ్స్ తో యువతను ఆకట్టుకోవడంతో టాప్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఇక రెండవది “The Family Man” ఇది కూడా Amazon Prime లో తన సత్తా చూపిస్తూ Best Web Series లలో ఒకటిగా నిలిచింది.

దీనిలో Manoj Bajpai ప్రధాన పాత్రలో ఇంటెలిజెంట్స్ విభాగంలో సీనియర్ ఎనలిస్ట్ గా మరియు తను చేస్తున్న వృత్తిని కుటుంభానికి కూడా తెలియకుండా ఒక ఫ్యామిలీ మ్యాన్ గా కవరింగ్ చేస్తూ అద్భుతమైన నటనతో ఈ వెబ్ సిరీస్ కు ప్రాణం పోసారు.

ఇక ప్రియమణి, షరిబ్ హస్మి వంటి తారాగణం ఇందులో ఉండగా టాలివుడ్ హీరో “సందీప్ కిషన్” దీనిలో మేజర్ విక్రమ్ క్యారెక్టర్ లో నటించారు. ఇక “The Family Man” కధ విషయానికి వస్తే పాకిస్థాన్ ISI , కేరళ నుండి ISI లోకి వెళ్లి తిరిగొచ్చి పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి భారత్ లో భోపాల్ గ్యాస్ తరహా భారీ కెమికల్ దాడికి ప్రయత్నిచే కధే ఇది దిఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమే లో 8.6 రేటింగ్ తో ఆకట్టుకుంది.

అద్భుతమైన స్క్రీన్ ప్లే, అంతకుమించి అద్బుతమైన నటీనటుల నటనతో ఈ వెబ్ సిరీస్ ను మరో స్థాయికి తీసుకు వెళ్లారు. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లిష్, బాషలలో ఈ నెల 23న తిరిగి కొత్త సీజన్ ప్రారంభం అవుతుండడంతో ప్రస్తుతం ఈ రెండు వెబ్ సిరీస్ లు ఎప్పుడు తిరిగి వస్తాయా అని వెబ్ సిరీస్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

   Read Also….  హీరోయిన్ కంగనా పై రేప్ చేస్తామంటూ బెదిరింపులు….