గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeజాతీయంఏడు వందల శ్లోకాలతో బియ్యపు గింజలపై భగవద్గీత...

ఏడు వందల శ్లోకాలతో బియ్యపు గింజలపై భగవద్గీత…

ఇండియాలో మైక్రో ఆర్టిస్ట్ అనగానే ఒక చిన్న పెన్సిల్ పైనో లేదా చెక్క వస్తువుల పైనో కంటికి కూడా సరిగ్గా కనపడని చిత్రాలను రోజుల తరబడి గీస్తుంటారు అదేదో టైమ్ వేస్ట్ పనిగా .. జీవితాంతం వీటిని గీస్తూ ఏంసాదిస్తారని వీరిపి అవహేళన చేసే వారిని చాలా మందే ఉన్నారు.

అయితే ఈ కళ భారత దేశంలో ఎప్పటినుంచో ప్రాచుర్యంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు కళా కారుల కష్టానికి తగిన చేయూత అందివ్వలేక పోతున్నారు.

అయితే తాజాగా ఈ సూక్ష్మ కళను పాత బస్తీకు చెందిన రామగిరి స్వారిక అనే అమ్మాయి బియ్యపు గింజలపై భగవద్గీత లోని 700 శ్లోకాలను ఆ బియ్యపు గింజలపై చెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందామే.

భగవద్గీతలో ప్రదానంగా ధర్మాన్ని రక్షించడం అనే సారాంశాన్ని కృష్ణుడు మానవులకు ఇచ్చిన సందేశాన్ని మొత్తం శ్లోకాల రూపంలో బియ్యపు గింజలపై రూపొందించి సనాతన ధర్మం విలువ ఎలాంటిదో అందరికీ తెలియజేసిందామే.

అయితే ఈ మొత్తం శ్లోకాలను బియ్యపు గింజలపై చెక్కడానికి ఆమెకు 150 గంటల సమయం పట్టింది. అయితే గతేడాది ఆంగ్ల అక్షరాలను చేక్కినందుకు గాను డిల్లీ లో రాష్ట్రీయ పురస్కారం దక్కింది. ఇక ఇలాంటి కళాఖండాలను చెక్కుతూ  తెలుగు రాష్ట్రాల్లో సూక్ష్మ కళాకారులు చాలా మందే ఉన్నారు.

ఈ కళ పై మక్కువతో విశాఖ పట్నానికి చెందిన వెంకటేష్ అనే కళాకారుడు న్యూయార్క్ నగరంలో ఉన్న “ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ “ ను అతి చిన్న పంటి పుల్లపై  ఏకంగా 6 సంవత్సరాలపాటు చెక్కి దానిని పూర్తిచేసాడు.

దీనితో వెంకటేష్ కు “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్” అతన్ని వరించింది. అయితే నేడు రామగిరి చెక్కిన కళాకృతి కూడా అలాగే గుర్తింపు పొందాలని కోరుకుంటూ ధర్మాన్ని రక్షిద్దాం…కళాకారులను గుర్తిద్దాం….         

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular