మంగళవారం, జూన్ 6, 2023
Homeఅంతర్జాతీయంపుల్వామా దాడి సూత్ర దారి మసూద్ అజర్ మేనల్లుడు ఇస్మాయిల్ ను ఎన్కౌంటర్ చేసిన బలగాలు

పుల్వామా దాడి సూత్ర దారి మసూద్ అజర్ మేనల్లుడు ఇస్మాయిల్ ను ఎన్కౌంటర్ చేసిన బలగాలు

ఫిబ్రవరి 14 తేదీ 2019 న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో విధుల నిమిత్తం ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనంపై ఆత్మాహుతి దాడి చేయడంతో భారతీయ సైనికులు 40మంది వీర మరణం పొందిన విషయం తెలిసిందే.

అత్యంత కిరాత చర్యకు పాల్పడింది పాకిస్థాన్ కు చెందిన జైషె మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ అయితే దీనికి ప్రదాన సూత్రదారి జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఇక ఈ ఘటనకు పాల్పడన వారిలో ఇప్పటికే మసూద్ అజర్ యొక్క బామ్మర్దిని భారత సైన్యం మట్టుబెట్టింది.

ఇక ఈ ఘటనకు పాల్పడిన వారిలో తొమ్మిది మందిని ఇప్పటికే ఎన్కౌంటర్ లో మట్టుబెట్టగా తాజాగా మసూద్ అజర్ మేనల్లుడు మహమ్మద్ ఇస్మాయిల్ అల్వీ ను సౌత్ కాశ్మీర్, అవంతిపురా పుల్వామా జిల్లాలో నిన్న దాచిగావ్ లోని సీఆర్పీఎఫ్ భలగాలు ఎన్కౌంటర్ చేసి మట్టుబెట్టాయి. పుల్వామా ఘటన సూత్రదారుల్లో ఇస్మాయిల్ అల్వీ కూడా ఒకడు. ఈ ఎన్కౌంటర్ లో ఇస్మాయిల్ తో పాటు మరో ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టారు.

జైషే మహమ్మద్ లో ప్రదాన కమాండర్ గా ఇస్మాయిల్ చెయ్యని అరాచకాలు లేవు వీటిలో 1999 లో 180 మంది ప్రయాణిస్తున్న విమానాన్ని ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ కి హైజాక్ చేసిన ఘటనకి ఇతనే సూత్రదారి ఈ ఘటనలో భారత్ అదీనంలో ఉన్న జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ ను భారత్ నుండి విడిపించాల్సి వచ్చింది అంతేకాక 2001లో ఏకంగా పార్లమెంట్ పై దాడి ఘటన దేశాన్ని ఒక్క కుదుపు కుదిపింది దానిలోనూ ఇతనే సూత్రదారి.

ఈ ఘటనల తరువాత జరిగిందే పుల్వామా ఎటాక్ ఈ ఎటాక్ పై నిప్పులు చెరిగిన భారత సైన్యం దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడుతున్నారు. తాజాగా నేటి ఎన్కౌంటర్ భారత ఆర్మీ కి ఒక మంచి విజయంగా చెప్పవచ్చు. ఎప్పటినుంచో కాపు కాసి వేచి చూస్తున్న బలగాలు నేడు ఇస్మాయిల్ ను వేటాడి మట్టుబెట్టాయి.

ఇవి కూడా చదవండి… పాకిస్థాన్ లో మేకపై గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఘటన 

                         భారత నేవీ అమ్ములపోదిలోకి MH-60R మల్టీరోల్ అటాకింగ్ హెలికాఫ్టర్లు

RELATED ARTICLES

Most Popular