ఆదివారం, మే 26, 2024
Homeభక్తిటీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడు చెప్పాడా..? దిమ్మతిరిగే ట్వీట్.

టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడు చెప్పాడా..? దిమ్మతిరిగే ట్వీట్.

ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆస్తుల అమ్మకానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయంపైనే వివాదం చెలరేగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యలు తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ నటుడు మంచు మనోజ్ తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేసారు. తిరుమల భూముల విషయంపై చాలామంది సినీ ప్రముఖులు నోరుమెదపకపోయినా మంచు మనోజ్ మాత్రం తన వంతు  గళం విప్పారు.

అసలు వెంకటేశ్వర స్వామి వారి ఆస్తుల్ని ఎందుకు అమ్ముతున్నారో అందరికీ  వివరణ ఇవ్వాలని కోరారు. మంచు  మనోజ్ ఈ మేరకు తన  ట్విటర్ ఖాతా లో ఘాటుగా సెటైరికల్ గా పోస్ట్  విడుదల చేశారు. ‘టీటీడీ ఆస్తులు అమ్మమని మీకు దేవుడేమన్నా చెప్పాడా ? చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాలక మండలి అంటే అంతా మీరే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులను, కొండకి వచ్చిన లక్షలాది మంది భక్తులనూ సుప్రభాత సేవకి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి అని శ్రీహరిని కూడా ఒక రకంగా  కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలే.

కొండపైన ఉన్న ఆ వడ్డీ కాసుల వాడి ఆస్తులే అమ్మకానికి వచ్చాయంటే ఇక ‘గోవిందా గోవిందా’ అని అరచిన భక్తుల ఈ గొంతు కొంచెం తడబడింది. మోసం జరగట్లేదని తెలుస్తుంది. ఎందుకంటే దీనిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం ద్వారా ప్రజల అందరి ముందు, అందరు చూస్తుండగానే ఈ అమ్మకం జరుపుతారు.

కానీ ఇలా ఎందుకు అమ్ముతున్నారు? అంటూ టీటీడీ పాలక మండలిని కొంచెం వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.దీనీపై వివరణ మాత్రం ఇస్తే చాలు. ఇంత పెద్ద కొండ (వెంకటేశ్వర స్వామి ) మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఈ విషయాన్ని ఆపుకోలేక అడుగుతున్నా సర్ అంతే అంటూ మనోజ్ పేర్కొన్నారు. మంచు మనోజ్ చేసిన ఈ ట్వీట్ దెబ్బకి సోషల్ మీడియాలో ఒక రకంగా వైరల్ అవుతోంది ధైర్యంగా గళం విప్పిన మంచు మనోజ్ ని వెంకన్న బక్తులు  చాలామంది అభినందిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular