శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంమమతా జీ మా మనోభావాలను దెబ్బతీయొద్దు...

మమతా జీ మా మనోభావాలను దెబ్బతీయొద్దు…

పశ్చిమ్ బెంగాల్‌లో అలజడులు రేగుతున్నాయి. బీజేపీ నేత హత్యని  నిరసిస్తూ ఆ పార్టీ కోల్‌కతాలో గురువారం భారీ ర్యాలీ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఓ సిక్కు యువకుడి పై బెంగాళ్ పోలీసుల వైఖరి తీవ్ర చర్చనీయాంశం అయింది.

భటిండాకు చెందిన 43 ఏళ్ల బల్వీందర్ సింగ్ తలపాగా పట్టుకుని పోలీస్ గుంజుతున్నట్టు  ఫోటోలు సోషల్ మీడియాలో చ్కర్లుకొడుతున్నాయి. ఇలాంటి చర్యలు  మత విద్వేషాలను రగిల్చేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు ఈ ఘటనపై స్పందిచారు.

ఏ వర్గం మరోభావాలను మే  కించపరచాలనే ఉద్దేశంతో చెయ్యలేదు ఇది యాదృశ్చికంగా జరిగిపోయింది అని స్పష్టం చేసింది పోలీస్ బ్రుందం. బల్వీందర్ సింగ్ దగ్గర తుపాకి ఉండటంతో దాన్ని  స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నంలో ఈ పొరపాటు అనుకోకుండా జరిగింని అతని తలపాగా ఊడిపోయిందని తెలిపారు.

అయితే ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా   క్రికెటర్  హర్బజన్ సింగ్ స్పందించారు. ఇది సరైంది కాదని మరియు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం జరిగిన విషయాన్ని వెంటనే పరిశీలించాలని హర్బజన్ ట్వీట్ చేశారు.

ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడిన పోలీస్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని శిరోమణి అకాలీదళ్ సైతం డిమాండ్ చేసింది.

అక్కడ జరిగిన గందరగోలంలో బల్వీందర్ సింగ్ దగ్గర లైసెన్స్డ్ 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతను  మాజీ సైనికుడని, జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీలో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో విదులు నిర్వర్తించినట్టు గుర్తించారు. అంతేకాకుండా  ఓ బీజేపీ నేత సెక్యూరిటీగా బల్వీందర్ సింగ్ ఉన్నారని  ఆ పార్టీ నేత దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular