ఆదివారం, మే 26, 2024
Homeసినిమాహీరో విశాల్ కి షాక్ ఇచ్చిన కోర్టు ఆ 8 కోట్లు కట్టాల్సిందే

హీరో విశాల్ కి షాక్ ఇచ్చిన కోర్టు ఆ 8 కోట్లు కట్టాల్సిందే

తెలుగు మరియు తమిళ సినిమాలలో నటిస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరో విశాల్. ఒకప్పుడు చిన్న సినిమాలకే పరిమితమైన విశాల్ గత మూడు సంవత్సరాలుగా బారీ సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తునాడు. ఈ క్రమంలోనే తాజాగా 2019 నవంబర్ లో వచ్చిన బారీ బడ్జెట్ మూవీ యాక్షన్. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా రిజల్ట్ ఇప్పటికీ విశాల్ ను వదిలిపెట్టడంలేదు. పూర్తి వివరాలలోకి వెళితే యాక్షన్ మూవీ కధను విశాల్ ముందుకు తీసుకు వచ్చిన డైరెక్టర్ సుందర్.సీ ఈ కధను విశాల్ కు వినిపించగా ఈ కధ విశాల్ కు నచ్చడంతో ఒకే చెప్పేసాడు.

అయితే డైరెక్టర్ ఈ సినిమాను 20కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించాలని భావించారు. అయితే విశాల్ కు కధ నచ్చడంతో దీనిని మల్టీ లాంగ్వేజ్ లో భారీ సినిమాగా తెరకెక్కించాలని భావించారు. ధానికి తగ్గట్టుగానే కధలో మార్పులు చేర్పులూ చేయించి ఒక యాక్షన్ అడ్వాన్చర్ సినిమాగా తీర్చి దిద్దారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ సైతం బారీ స్థాయిలోనే అమ్ముడుపోయాయి. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ హిందీలో 9 కోట్లు రాగా తెలుగు డబ్బింగ్ టైట్స్ నిమిత్తం 7కోట్లు వచ్చాయి.

అయితే సినిమా స్టార్ట్ చేయక ముందు విశాల్ మరియు నిర్మాత రవీందరన్ మద్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో ఒక వేల సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టాన్ని విశాల్ బరించాలంటూ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.

ఇక సినిమా రిలీజ్ కావడం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాదించకపోవడంతో దాదాపు 8 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇక తెలుగులో 7 కోట్లకు గాను 4కోట్ల రూపాయలు మాత్రమె వసూలు చేసింది. మిగిలిన ప్రాంతాలలో కూడా చాలా వరకూ రాబట్టుకున్నా కొంత మేర నష్టాన్ని బారించాల్సి వచ్చింది.

అయితే సినిమా నిర్మాత ఈ నష్టాన్ని ఇవ్వమని కోరగా విశాల్ దీనికి అంగీకరించకపోవడంతో సినిమా నిర్మాత రవీందరన్ మద్రాస్ హై కోర్టులో కేసు వేయగా తాజాగా ఈ కేసు విచారణకు రావడంతో ఈ సినిమాకు వచ్చిన నష్టం 8 కోట్ల రూపాయలను విశాల్ నిర్మాతకు కట్టాల్సిందేనని ఆదేశించింది.   

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular