శనివారం, మే 18, 2024
HomeరాజకీయంYS Sharmila ఇంటి ముట్టడి..రాయలసీమను ఎడారిగా చెయ్యోద్దు...ఏపీ పరిరక్షణ సమితి

YS Sharmila ఇంటి ముట్టడి..రాయలసీమను ఎడారిగా చెయ్యోద్దు…ఏపీ పరిరక్షణ సమితి

ఏపీ, తెలంగాణా మద్య నీటి వివాదం రోజు రోజులూ మరింత ముదురుతుంది. తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికీ ఏపీ పై పలు విమర్శలు చేసారు. అంతేకాక మంత్రి అనిల్ కుమార్ కు ప్రాజెక్టులపై పూర్తి అవగాహన లేదని విమర్శించారు. అంతేకాక వైఎస్ రాజశేఖరరెడ్డి పై కూడా పలు విమర్శలు చేసారు. ఈ విషయం ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతున్న సమయంలో YS Sharmila చేసిన వ్యాఖ్యలతో ఏపీలోని పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పూర్తి వివరాలలోకి వెళితే గతంలో తెలంగాణా మంత్రి సురేష్ గౌడ్ కృష్ణా రివర్ బోర్డ్ లో రాయలసీమ ప్రాజెక్టు ను ఆపాలంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై వైఎస్ Sharmila స్పందిస్తూ మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా తెలంగాణకు అన్యాయం జరిగే ఏ పనినైనా లేదా ప్రాజెక్టునైనా అడ్డుకుంటామన్నారు.

అంతేకాక తెలంగాణకు దక్కే ఏ ఒక్క నీటి చుక్కనూ వదలమంటూ సభావేదిక తెలిపారు. అయితే YS Sharmila చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయ ముట్టడించారు. ఈ విషయంపై ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు స్పందిస్తూ “షర్మిల” ఆంద్ర ప్రదేశ్ రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను ఉపసంహరిమ్చుకోవాలన్నారు. తెలంగాణాలో ఉన్న అక్రమ ప్రాజెక్టుల వాళ్ల రాయల సీమకు అన్యాయం జరుగుతుందని దీనిని షర్మిల ఎలా సమర్దిస్తారంటూ ప్రశ్నించారు. రాయలసీమను ఎడారి చెయ్యొద్డంటూ కోరారు.  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular