శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంకరోనాను మించిన మహమ్మారి.. ఈ మిడతలు గుంపు...

కరోనాను మించిన మహమ్మారి.. ఈ మిడతలు గుంపు…

నేడు ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చెస్తుంది ఈ కరోనా.. ఈ కరోనా దెబ్బకు దాదాపు ప్రపంచ దేశాలు అన్నీ ఆర్దికంగా తీవ్రంగా నష్ట పోయాయి. దాంతో ఎంతో మంది సగటు మానవులు తమ ఉద్యోగులు కోల్పోగా మరి కొందరు సగం జీతాలతో అతి కష్టంగా కుటుంబ బాధ్యతలను నెట్టుకొస్తున్నారు. మన దేశాలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు కోవిడ్ వల్ల ఏర్పడ్డ ఈ  భయంకరమైన ఆర్ధిక కష్టాల నుంచి ఎప్పుడు బయట పడతామో తెలియక కొట్టు మిట్టాడుతున్న మన దేశ ప్రజలను మరింత కృంగ తీసి ఆకలి కేకలు పెట్టించాడనికి మరొక ఉప ద్రవం మెల మెల్లగా మన దేశాలు మొత్తం వ్యాపించనుంది.

ఇప్పటికే ఆ మిడతల గుంపు ఉత్తర భారత దేశంలోని  చాలా రాష్ట్రాల్లో వ్యాపించగా రేపో మాపో మన తెలుగు రాష్ట్రాల పై దాడి చేయడానికి సిద్దంగా ఉంది. ఆ మహమ్మారి దెబ్బతో కేంద్రం కూడా అత్యున్నత సమావేశలు నిర్వహించి పరిస్థితులను అంచనా వేస్తుంది. దాంతో దేశ ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఏమి తోచని స్థితిలో పడిపోయారు. అసలు ఎంటి ఆ మహమ్మారి..? దాని వల్ల జరిగే నష్టం ఎంటి?  అది మన దేశం లోకి ఎలా ప్రవేశించింది? మనం దాని మూలంగా ఆకలి కేకలు ఎందుకు పెట్టాలి..? దాన్ని ఎదుర్కోవడం ఎలా అనేటువంటి ప్రశ్నలు ప్రజల్లో ఆందోళన పెడుతున్నాయి.

మిడతలు దండు ప్రయాణం:

పశ్చిమ భారత దేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో కి ప్రవేశించిన ఈ మిడతలు దండు అక్కడ నుండి గుజరాత్ లోకి ప్రవేశించి ఆ తరువాత మెల్ల మెల్లగా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల పై దాడి చేస్తున్నాయి. మిడతలు ఎప్పటినుండో మన దేశంలో ఉన్నాయి కదా ఇప్పుడు కొత్తగా రావడం ఎంటి వాటి వల్ల ఆహార సంక్షోభం ఎలా ఏర్పడుతుంది అని సందేహాలు మనలో చాలా మందికి కలగొచ్చు వీటికి సమాధానం తెలియాలంటే ఈ మిడతల గురించి పూర్తిగా తెలుసుకువాలి.

మిడతలు గురించి పూర్తి వివరణ:

అయితే అవి ఏంటంటే ఇవి మనం రోజు పల్లెటూర్లలో ఇళ్లలో చూసే ఒకటో రెండో మిడతలు వంటివి కాదు. తూర్పు ఆఫ్రికా దేశాలు అయిన ఇథియోపియా,  సోమాలియా వంటి దేశాలలో ఈ మిడతలు పుట్టాయని నిపుణులు చెప్తున్నారు. ఎడారి మిడతలు అని పేరుపొందిన ఈ కీటకాలు వందలు వేలు లక్షలు గుంపులుగా తిరుగుతూ పచ్చని కనపడిన మొక్కని చెట్లని క్షణాల వ్యవధిలోనే నాశనం చేసేస్తాయి.

పచ్చ గా ఉన్న చెట్టు పై ఈ మిడతల దండు ఒక్కసారిగా వాలితే కేవలం నిమిషాల్లోనే ఆ చెట్టుకున్న ఆకులన్నీ తినేసి మొడు బారెల చేస్తాయి. ఈ దండు పంట పొలాల్లో పడితే కొన్ని గంటల్లోనే ఆ పంట మొత్తాన్ని నాశనం చేసేస్తాయి. ఆఫ్రికాలో విలయ తాండవం సృష్టించిన ఈ మిడతలు దండు ఏకంగా హిందూ మహా సముద్రం సైతం దాటి సౌదీ అరేబియా ఇరాన్ పాకిస్థాన్  ల మీదుగా ప్రయాణించి ఇప్పుడు మన దేశంలో కి ప్రవేశించాయి.

సాధారణ మిడతల కంటే పెద్దగా ఉండే ఈ ఎడారి మిడతలు తమ శరీరం కంటే రెండు ఇంతలు ఎక్కువ ఆహారం తీసుకోగలవు. వందలు వేలు లక్షల కొద్ది  గుంపులు గా ఎగిరే ఈ కీటకాలు ఒక రకమైన ద్రావణాన్ని తమ శరీరంలో నుండి విడిచి అవి గుంపుగా ఎటువంటి సమస్యా లేకుండా ఎగురుతాయి. ఆఫ్రికా దేశాలలో చాలా పెద్దగా ఉండే విటి పరిమాణం Middle East ఆసియా దేశాలు అయిన పాకిస్థాన్, భారత దేశాల్లోకి వచ్చే సరికి వాటి పరిణామంలో గణనీయమైన పరిమాణం చోటు చేసుకొని మారాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయిన అవి బారీ గుంపులుగా ప్రయాణించడం వల్ల పాకిస్థాన్ వ్యవసాయ రంగనికి ఆయువు పట్టు అయిన  సింధ్ ప్రావిన్స్ లో దాదాపు పంటలన్నింటిని ఊడ్చేశాయి.

అసలే ఆర్థిక పరిస్తుల వల్ల దివాలా తీసేసిన పాకిస్థాన్ ప్రభుత్వం ఈ మిడతలు ఇచ్చిన ఎఫెక్ట్ తో ఏమి చేయాలో తెలియక ఆహారం కోసం ప్రపంచ దేశాలను జోలె పట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక దేశ పరిస్థులు తల కిందలు చేయ గల సామర్ధ్యం కలిగిన ఈ మిడతలు ఒక్క రోజులో దాదాపు 150 కిలో మీటర్లు ప్రయనించగలవని ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్థాయి అని వీటికి ఓపిక బాగా ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. అదే ఓపిక తో నేడు పాకిస్థాన్ నుండి మన దేశానికి  ప్రవేశించాయి అని అంటున్నారు. దాదాపు 90 రోజులు పాటు బ్రతక కలిగే ఈ మిడతలు తమ జీవిత కాలంలో రెండు సార్లు గుడ్లు పెడతాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఈ ఎడారి మిడతలు శృష్ఠించే విధ్వవంశం గురించి FOOD AND AGRICULTURE ORGANISATION  అనే సంస్థ కీటకాలతో  పోలిస్తే ఎడారి మిడతలు అత్యంత ప్రమాదకరమని వీటి వల్ల ప్రపంచం తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఒక నివేదికలో వెల్లడించింది. ఇంతటి భయంకరమైన కీటకాలు నేడు ఉత్తర భారతదేశం మొత్తం వ్యాపిస్తూ ఉండగా మరి కొన్ని రోజుల్లో దక్షణ భారత దేశం లోని మన తెలుగు రాష్ట్రానికి మొదట దాడి చెయ్యబోతున్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి దీనిని నివారించి ఆహార సంక్షోభం నుండి కాపాడడానికి మన ప్రభుత్వాలు ఎటు వంటి చర్యలు జాగ్రత్తలు తీసుకుంటాయో వేచి చూడాలి.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular