రియల్ హీరో అంటే ఇతనే ..హీరో సూర్య పై నెటిజన్లు ఫిదా

0
92
suriya latest news
suriya latest news

తమిళ అగ్ర కదానాయకులలో ఒకరు హీరో సూర్య. Kollywood లోనే కాకుండా Tollywood లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. శివపుత్రుడు సినిమాతో తెలుగువాళ్ళకు పరిచయమైన సూర్య విబిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతేకాక వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూనే Agaram Foundation స్తాపించి ఈ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు సూర్య.

ఇక తాజాగా సూర్య నటించిన surarai pottru ( Aakasam Nee Haddura), Jai Bhim, ET వంటి విభిన్న కథా చిత్రాలలతో ప్రేక్షక ఆదరణ పొందారు. ఎప్పుడూ సింపుల్ గా ఉండే సూర్యకు సంబధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఒక టీ షర్ట్ వేసుకుని ఎద్దును తాడుతో పొలాల పక్కన నుండి తీసుకు వెళుతున్న ఫోటో బయటకు వచ్చింది. దీనితో సూర్య ఫ్యాన్స్ తెగ సంబరపడుతూ సూర్య సింప్లీ సిటీకి ఈ ఫోటోనే నిదర్శనమంటూ తెగ పొగిడేస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన తమిళ సంవత్సరం సందర్భంగా ఈ వీడియోను సూర్య ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య నేషనల్ అవార్డ్ గ్రహిత వట్రిమారన్ దర్శకత్వంలో “వాడివాసల్” అనే యాక్సన్ ఎంటర్టైనేర్ చేస్తున్నారు. అయితే ఒక నవల ఆధారంగా తెరకెక్కే ఈ సినిమా జల్లికట్టు ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.