ఆదివారం, జూలై 21, 2024
Homeభక్తిబోనాల సంభారాలతో కళకళ లాడుతున్న భాగ్యనగరం | Bonalu 2021

బోనాల సంభారాలతో కళకళ లాడుతున్న భాగ్యనగరం | Bonalu 2021

తెలంగాణాలో Bonalu పండుగ వచ్చిందంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆ హడావిడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగే బోనాల పండుగ ప్రతీ ఏడాదీ అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ బోనాల పండుగకు విశేషమైన ప్రాచుర్యంతో పాటు భక్తులకు అమావారి పట్ల ఎనలేని నమ్మకం కూడా ఉంటుంది.

దీనితోనే క్రమం తప్పకుండా బోనాల పండుగ వచ్చిందంటే ఇంటి ఆడపడుచులు ఇంటిల్లి పాది అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తూ బోనాలు కట్టి తీసుకువచ్చి ఆ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు.

అసలు Bonalu జరపడానికి గల కారణం

అసలు ఈ బోనాలు ప్రదానంగా కాకతీయ వంశస్తుల కాలంలోనే ఈ బోనాలు ఉన్నట్లు చెబుతారు. 1869 వ సంవత్సరంలో మసూచి దాటికి అనేక మంది మరనిచడం గమనించిన గ్రామ పెద్దలు అక్కడ ఉన్న అమ్మవారి తీవ్రత ఎక్కువగా ఆప్రాంతంపై ఉండడం వాళ్ల ఇలా జరిగుతుందని బావించి ఆ దేవతని శాంతింపజేయడం కోసం ఈ Bonalu సమర్పిచడం మొదలు పెట్టారు.

ఆషాడ మాసంలో వచ్చే Bonalu

ఇక ఈ భోనాలు ఆషాడ మాసంలో ఉన్న నాలుగు వారాల్లో మొదటగా గోల్కొండ బోనాలు తరువాత ఉజ్జయినీ మహంకాళి బోనాలు, చిలకలగూడ లో కట్ట మైసమ్మ , తరువాత లాల్ దర్వాజ వద్ద భోనాలు సమర్పిస్తుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా Lal Darwaza Bonalu కు ప్రాముక్యత

ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ Bonalu పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ బోనాలలో ముఖ్యంగా ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాడి పంటలతో కళకళ లాడుతూ సంవృద్దిగా వర్షాలు కురవాలని కోరుకుంటారు.

అందుకే ఈ Lal Darwaza Bonalu పండుగను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇక ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలిగి ఆయిరారోగ్యాలతో ధన దాన్యాలతో సంతోషంగా ఉండాలని ఈ కరోనా మహామ్మారి నుండి త్వరగా బయటకు రావాలని కోరుకుంటూ ప్రజావారధి తరపున తెలుగు ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు 

ఇవి కూడా చదవండి …పాకిస్థాన్ లో మేకపై గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఘటన 

 

  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular