మంగళవారం, జూన్ 18, 2024
Homeభక్తిమంటల్లో కాలిపోయిన Lakshmi Narasimha Swamy వారి రధం.

మంటల్లో కాలిపోయిన Lakshmi Narasimha Swamy వారి రధం.

తూర్పు గోదావరి జిల్లా లో అంతర్వేది లో ఉన్న శ్రీ Lakshmi Narasimha Swamy వారి కళ్యాణ రధం అగ్నికి ఆహుతి అయిపోయింది. అధికారుల సమాచారం ప్రకారం నేటి తెల్లవారుజామున సుమారు 2గంటలకు ఈ రధం మంటల్లో కాలిపోతుండగా చూసిన అక్కడి వారు పోలీసులకు మరియు ఫైర్ సిబ్బందికీ సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి వచ్చి మంటలను ఆర్పెలోపే చాలా వరకూ రధం కాలిపోయినట్లు తెలిపారు.

 ఈ ఘటనను చూసిన స్థానిక భక్తులతో సహా హిందూ పరిరక్షణ సమితి సైతం దేవస్థానం ఈవో పై ఆగ్రహంతో దేవస్థానం ముందు ఆందోళనకు దిగడంతో అక్కడికి వచ్చిన పోలీసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసారు. స్థానిక భక్తులు దేవాలయం ఈవో పై వాగ్వాదానికి దిగి తమ అశ్రద్దవల్లె రధం కాలిపోయిందంటూ మండిపడ్డారు.

 షెడ్డులో ఉన్న సీ,సీ కెమెరాలు సుమారు ఆరు నెలలుగా పనిచేయకపోయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. అంతేకాక తమకు ఈ ఘటనపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ తక్షణమే దీనిపై దర్యాప్తు చేపడతామన్నారు.

ఒకవేళ ఈ ఘటనలో ఎవరిహస్తం అయినా ఉన్నట్లు తెలిస్తే ఎలాంటి వారైనా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరికొంత సేపటికి డాగ్ స్వాడ్ ఇక్కడకు వస్తుందని వెంటనే దర్యాప్తు మొదలుపెడతామన్నారు. అంతేకాక దగ్గరలో షాప్ లనుండి ఇక ఈ ఘటనపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

సుమారు 70 సంవత్సరాలనుండి ఈ రధంపై ప్రతీ సంవత్సరం లక్ష్మీనరసింహ స్వామి వారిని ఊరేగిస్తూ వస్తున్నారు. ఈ Lakshmi Narasimha Swamy రధం నిర్మాణంలో పూర్తిగా టేకును ఉపయోగించారు. అంతర్వేది Sri Lakshmi Narasimha Swamy వారి కల్యాణం అత్యంత అద్భుతంగా జరుపుతారు.

 రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారి కల్యాణం అనగానే తెలంగాణా నుండి కూడా అనేక మంది భక్తులు ఈ కల్యాణానికి చేరుకుంటారు. ఇక ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి వారికి లక్ష్మీ నరసింహస్వామి వారిపై ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది.

స్వామిని నమ్మితే కోరినకోర్కెలు తీరడమే కాక ఆ ప్రాంతంలో ఉన్న సముద్రం  ఉగ్రరూపం దాల్చకుండా ఎలాంటి ముప్పు రాకుండా Lakshmi Narasimha Swamy తమని ఎప్పుడూ కాపాడతాడని నమ్ముతారు. నేడు జరిగిన ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular