శుక్రవారం, మార్చి 29, 2024
Homeఅంతర్జాతీయంచైనా బోర్డర్ లో భారత జవాన్లకు ఎలాంటి ఆపధ వచ్చినా మేము రడీ... లద్దాక్ యువకులు

చైనా బోర్డర్ లో భారత జవాన్లకు ఎలాంటి ఆపధ వచ్చినా మేము రడీ… లద్దాక్ యువకులు

భారత్ మరియు చైనా ల మద్య బోర్డర్ వివాదం నేడు తీవ్ర స్థాయికి చేరుకుంది. చైనా ఇప్పటికే భారీ స్థాయిలో బోర్డర్ అతి సమీపంలోనే యుద్ద విమానాల బేస్ ల సంఖ్యతో పాటు ఆర్టిలరీ వెహికిల్స్, బంకర్ లను అదికంగా నిర్మిస్తుంది. అంతేకాక భారత్ – చైనా బోర్డర్లో సుమారు 60వేల మంది సైన్యాన్ని బోర్డర్ కు సమీపంలో ఉంచినట్లు తెలుస్తుంది.

ఇక యుద్ద సామాగ్రీ సైతం అదికంగా పెంచుకుంటూ పోతుంది. అయితే చైనా నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు భారత సైన్యం కూడా బోర్డర్ కి యుద్ధవిమానాలు, ఆర్మీ బలగాలతో పాటు హెవీ ఆర్టిలరీ, రాకెట్ లాంచేర్స్, హెవీ డ్యూటీ ట్యాంక్స్ ను బోర్డర్ కు చేర్చింది.

రెండు రోజుల క్రితం చైనా ఆర్మీ రాత్రి సమయంలో బోర్డర్లు మార్పునకు ప్రయత్నించగా ముందుగానే ఈ విషయాన్ని గమనించిన భారత్ జవాన్లు బారీస్థాయిలో  ఆ ప్రాంతానికి చేరుకోవడంతో చైనా ఆర్మీ అక్కడినుండి జారుకుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ చైనాకు ఇకపై దాని భాషలోనే బుద్దిచేప్పాలనే ఉద్దేశంతో మరుసటిరోజు ఏకంగా చైనాకు కీలకమైన మూడు ప్రాంతాలను భారత్ స్వాదీనం చేసుకుని అక్కడ భారత ఆర్మీ తమ భలగాలను అక్కడ మోహరించి భారత జాతీయజెండా ఎగరవేశారు జవాన్లు.

భారత జవాన్ల పరాక్రమానికి  చైనా ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలక పరిస్తితిలా తయారైంది. ఎందుకంటే భారత్ ఆక్రమించుకున్న “కాలా టాప్” అనే ప్రాంత ప్రంపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలలో ఒకటి. కాలా టాప్ నుండి చూస్తె చుట్టూ 20కిలోమీటర్ల వరకూ మొత్తం చైనా బేస్ లతో సహా చైనా ఆర్మీ ప్రతీ కదలికా ఇట్టె పసిగట్టవచ్చు. ప్రస్తుతం భారత్ ఆ ప్రాంతంలో డిఫెన్స్ ఎక్యూప్మెంట్ భారీ స్థాయిలో మోహరించింది.

అత్యంత ఎత్తైన ప్రదేశం కావున చైనా ఆర్మీ బేస్ లపై దాడిచేసేందుకు మరింత సులువైంది.  అయితే అంత కీలకమైన ప్రాంతం అయినా  భారత్ జవాన్లు అక్కడ విధులు నిర్వర్తిన్చాలన్నా అనేక ఒడిదుడుకులతో కూడిన వ్యవహారం. ఒక భారీ పర్వతంలా ఉండే ఈ కొండ ఎత్తు సుమారు 8000 అడుగులు.

ప్రతీ రోజూ విధులు నిర్వర్తించే జవాన్లకు ఇక్కడ అనేక సవాళ్లు ఎదురౌతున్నాయి. వారి ఆహారం, సామాగ్రీ , మంచినీరు వాటి వాటికి ఇబ్బందులు ఎదురౌతుండగా ఇది గమనించిన లద్దాక్ ప్రాంత స్థానిక యువకులు జవాన్లకు కావాల్సిన సరుకులు, కర్రలు, మంచినీరు వంటివి అంత ఎత్తు నడుచుకుంటూ వాలంటీర్లుగా సహాయం చేస్తున్నారు.

ఎలాంటి ఆవసరం వచ్చినా తమను పిలవాలని జవాన్లను కోరుతున్నారు. అంతేకాక చైనా దాడికి దిగితే మీకు సాయంగా వచ్చేందుకు తాము కూడా సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. స్థానిక యువత ఎంతో బాధ్యతతో సాయం చేస్తుండడం పట్లు పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 30వ తేదీ రాత్రి చైనా బారత భూబాగాన్ని ఆక్రమానని అడ్డుకుని చైనా సైనికులను వెనక్కు పరిగేట్టించిన స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సు కమాండర్ చైనీస్ ఆర్మీ పెట్టిన ల్యాండ్ మైన్ పేలి వీర మరణం పొందడంతో అక్కడి స్థానికులు చైనాపై రగిలిపోతున్నారు.          

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular