శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి కన్నుమూత షాక్ లో సినీ ఇండస్ట్రీ..!

ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి కన్నుమూత షాక్ లో సినీ ఇండస్ట్రీ..!

ప్రముఖ  కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు ఇక లేరు. బుధవారం తెల్లవారు జామున గుండె పోటుతో కన్నుమూశారు. ఆమె వెంకట నాయుడు సరోజినీ దేవి దంపతులకు విశాఖ పట్నం జిల్లా అనకపల్లి లో 1956 లో జన్మిచారు.

తండ్రి నీటి పారుదల శాఖ లో ఎగ్జక్యూటివ్ ఇంజనీర్ గా పని చేసేవారు. తల్లి గృహిణి మూడేళ్ల వయసులోనే శోభా నాయుడి ప్రతిభను తల్లి సరోజినీ దేవి గుర్తించారు.

రేడియోలో వచ్చే పాటలకు నృత్యం చేసే తన కూతురిని చూసిన సరోజి దేవి శోభా నాయుడుని ఎలాగైనా నృత్య కళాకారిణి ని చేయాలని సంకల్పించింది. రాజమండ్రీ నృత్య  కళాకారులు TL రెడ్డి దగ్గర చేర్పించారు. రాజమండ్రీ లో ఐదేళ్లు కూచిపూడి నాట్యం నేర్చుకున్న శోభా నాయుడు ఆరేళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చారు.

ఈక్రమంలో తండ్రి కి ఉద్యోగ రిత్యా బదిలీలు ఎక్కువగానే అయ్యాయి కానీ తల్లి శోభా నాయుడు నాట్యానికి ఆటంకం కలిగించకూడదని భావించిన తల్లి పీఎల్ రెడ్డి సహాయంతో చెన్నై తీసుకెళ్లారు.

కళలకు పుట్టిన ఇల్లుగా నిలిచే చెన్నైలో ప్రముఖ నాట్య గురువు వెంపటి చిన సత్యం వద్ద శిష్యురాలు గా చేర్పించారు. అలా 12 ఏళ్ల వయసులో కూచిపూడి నృత్యంతో అరంగేట్రం చేసిన శోభా నాయుడు దేశం గర్వించే కూచిపూడి నృత్య కళాకారిణిగా ఎదిగారు.

పసి వయసు నుంచే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. 12 ఏళ్ల వయసులోనే స్టేజ్పై అరంగేట్రం చేసి కూచిపూడి నాట్యంలో తనదైన ముద్ర వేశారు.

తన కలను భావి తరాలకు అందించాలన్న ఉద్దేశంతో కూచిపూడి అకాడెమీ స్థాపించి ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దారు. కూచిపడిలో తను అందించిన సేవలకు గాను 2001 లో భారత ప్రభుత్వం “పద్మశ్రీ” పురస్కారంతో గౌరావించింది.

కూచిపూడి నృత్యంలో గురువు వెంపటి చిన సత్యం తగ్గ శిష్యురాలుగా ఎదిగిన నృత్య కళాకారిణి శోభా నాయుడు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. 1982 మద్రాసు లోని కృష్ణ గానసభ వారి నుండి ‘నృత్య చూడామణి’, 1998 లో ‘ఎన్టీఆర్ పురస్కారం’, 1990  లో సంగీత ‘నాటక అకాడమీ’ పురస్కారం, 2011 -లో  తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు అందుకున్నారు.

12 ఏళ్ల వయసులోనే రంగస్థలం పై అరంగేట్రం చేసిన ఆమె ఐదు దశాబ్దాలుగా కూచిపూడి  నృత్యమే శ్వాసగా జీవించారు. నాట్యం అంటే కేవలం అభినయమే కాదు  జీవం ఉండాలి అనే శోభా నాయుడు కూచిపూడినే సరికొత్తగా ప్రదర్శించే వారు

శోభా నాయుడు నృత్య రూపకాలలో సత్యభామ, దేవ దేవకి, మోహిని, సాయి బాబా,  పద్మావతి, పార్వతి, చండాలిక పాత్రలు ఆమె కు  మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular