హై అలర్ట్ ఆ భవనాలు ఖాళీ చెయ్యండి.. కేటీఆర్ ఆదేశం ..

0
136
ktr
ktr

భారీ వర్షాల కారణంగా అధికారులు అలర్ట్ అవుతున్నారు. పాతబస్తీలో ఒక  బిల్డింగ్ కూలి  ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. దీనిపై మంత్రి కేటీఆర్  జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్  చేశారు.

ప్రస్తుతం వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్ ప్రాకారం భారీ వర్షాలు కురిసే  అవకాశం ఉన్నందున వెదర్ డిపార్ట్మెంట్  హెచ్చరికల నేపథ్యంలో జంటనగర పరిధిలో ముఖ్యంగా పాతబస్తీలో పురాతన, పాత  ఇళ్లను, బిల్డింగ్స్ ను తక్షణం ఖాళీ చేయించాలని కేటీఆర్ సంబంధిత అధికార యంత్రాంగాన్ని  ఆదేశించారు.

నగరాలలో శిథిలావస్థకు చేరిన భవనాలకు అధికారులు నోటీసులు ఇవ్వాలని కేటీఆర్  జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపారు. కుండపోతగా వర్షాలు కురవడంతో  అత్యంత అప్రమత్తం‌గా ఉండాలని  అసిస్టెంట్ సిటీ ప్లాన్నర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని మంత్రి నిర్దేశించారు.