విషమంగా కిమ్ ఆరోగ్యం హార్ట్ సర్జరీ తర్వాత పలు అనుమానాలు ..?

0
189
kim jong un in serious condition
kim jong un in serious condition

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్​ ఉన్ ఈ పేరు తెలియని వారు ఉండరేమో ఎందుకంటే ఎప్పుడూ ఎదో వివాదాస్పద పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. అమెరికా అంటేనే అంతెత్తున లేచే కిమ్ కరోనా సమయంలో కూడా దేశంలో కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని షూట్ చేయించారనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే గత కొన్ని రోజులుగా కిమ్ బయటకు రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. అయితే కిమ్ కు కొన్ని రోజులక్రితం హార్ట్ సర్జరీ జరిగిన   అనంతరం ఉత్తర కొరియా అధ్యక్షుడు kim jong un పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు వస్తోన్న వార్తలను అమెరికా నిఘా విభాగం దీనిని  పరిశీలిస్తున్నాయి.

అయితే ఉత్తర కొరియాలో అలాంటి వార్తలు ఏమీ లేవని సియోల్​ అధికారులు తెలిపారు. అతడి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదని కరోనా కంటే తీవ్ర వ్యాధితో బాధపడుతునారని వార్త ఇప్పుడు బయటికొచ్చింది.

అయితే ఉత్తర కొరియాలో ఎటువంటి అనుమానాస్పద చర్యలను గుర్తించలేదని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం బ్లూ హౌస్​ పేర్కొంది. ప్రస్తుతం కిమ్​ ఆరోగ్య విషయంపై స్పష్టత ఇవ్వలేమని బ్లూ హౌస్​ తెలిపింది. తన తాతైన కిమ్​ ఇల్​ సుంగ్​ జయంతి వేడుకలకు ఏటా హాజరయ్యే కిమ్​.. ఈ సారి రాకపోవడం వల్ల ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.