గురువారం, మార్చి 28, 2024
Homeఅంతర్జాతీయంకిమ్ మరణం నిజమేనా..తన స్థానంలోకి అధ్యక్ష్యురాలిగా "కిమ్ యో జోంగ్"

కిమ్ మరణం నిజమేనా..తన స్థానంలోకి అధ్యక్ష్యురాలిగా “కిమ్ యో జోంగ్”

గత కొన్నాళ్ళుగా చర్చ మొత్తం ఉత్తరకొరియా అద్యక్ష్యుడైన కిమ్ జోంగ్ ఉన్ పైనే నడుస్తుంది. కిమ్ ఒక నియంత ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. అక్కడి ప్రజలు దుర్బర జీవితం గడుపుతుంటే కిమ్ జోంగ్ మాత్రం దీపావళి బాణాసంచా మాదిరిగా కుప్పలుగా మిస్సైల్స్ తయారు చేయించి వాటిని ప్రయోగిస్తుంతాడు.

అయితే గత నెల రోజులుగా కిమ్ బయటకు రాకపోవడంతో పలు దేశాలకు అనుమానం కలుగుతుంది. ఈ విషయంపై అమెరికా, దక్షిణ కొరియా  వంటి దేశాల ఇంటెలిజెంట్ విభాగం ఇప్పుడు దీనీపై ద్రుష్టి సారించాయి.

కొన్ని రోజుల క్రితం కిమ్ జోంగ్ కు గుండె ఆపరేషన్ జరిగింది అయితే ఆ ఆపరేషన్ తరువాత కిమ్ ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరకొరియా మీడియా మాత్రం కిమ్ జోంగ్ ఆరోగ్యం పై ఎటువంటి సమాచారం ఇప్పుడే ఇవ్వలేమని చెప్పింది. అయితే ఆ దేశమీడియా అక్కడి అధికారుల కనుసన్నల్లోనే పనిచేస్తుంది. వారి ఆదేశాలు దాటి ఒక్కమాట కూడా బయటకు చెప్పదు. అయితే నేషనల్ మీడియా మాత్రం కొన్నిరోజులుగా కిమ్ జోంగ్ కు బ్రెయిన్ డెడ్ అయ్యిందని కొన్ని వార్తలను ప్రచురించింది.

kim jong un sister
kim jong un sister

అయితే ఇప్పుడు ఉత్తర కొరియాకు చెందిన న్యూస్ ఎనలైజ్ చేసే ఒక రిపోర్టర్ కహీవా మాత్రం అక్కడ జరుగుతున్న కొన్ని నిజాలను బయట పెట్టింది. చాలా పత్రికలు నిజాలు చెప్పడంలేదని..ఇప్పటికే కిమ్ జోంగ్ ఉన్ చేనిపోయారని ఈ విషయాన్ని ఇప్పటివరకూ బయటకు రానివ్వడం లేదని చెప్పిందామె గత కొన్ని రోజులుగా ఉత్తరాకోరియాలో చాలా మార్పులు వచ్చాయని అక్కడి అధికారులు  కిమ్ జోంగ్ ఉన్ స్థానం లో తన సోదరి “కిమ్ యో జోంగ్” ని నియమించారని చెప్పింది.

                               

ప్రస్తుతం ఈ విషయం పై పలు దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. అసలు కిమ్ జోంగ్ ఉన్ చెల్లి ఎవరనుకుంటున్నారా కిమ్ నమ్మే ఒకే ఒక్క వ్యక్తి ఆమె కిమ్ జోంగ్ తండ్రి చనిపోయిన తరువాత ఆ స్థానంలో కిమ్ వచ్చాడు అప్పటి నుంచీ వెనక నుండి మెత్తం ప్లానింగ్ అంతా తన చెల్లి “కిమ్ యో జోంగ్” దే. కిమ్ కన్నా కూడా ఆమె ప్రభావవంతమైన నాయకురాలు.

ఎవ్వరికీ బయపడని వ్యక్తిత్వం ఒకసారి కిమ్ జోంగ్ ఉన్ మిస్సైల్ పరీక్షలు చేస్తుండగా దక్షిణకొరియా ఘాటుగా స్పందించడంతో దీనికి కౌంటర్ గా కుక్కలు మొరగడమే గాని ఏమీ చెయ్యలేవు అనడంతో అప్పుడు రెండు దేశాల మద్య పెద్ద దుమారమే చెలరేగింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular