శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంనేడు కొండ పోచమ్మ సాగర్ ఆరంభం..

నేడు కొండ పోచమ్మ సాగర్ ఆరంభం..

గోదావరి జలాలను ఒడిసి పెట్టేందుకు కొండ పోచమ్మ సాగర్ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడిన ఈ రిజర్వాయర్ ను కెసిఆర్ ఇవాళ ప్రారంభించారు.

ప్రారంభత్సవం:

నేడు సీఎం కెసిఆర్ ఉదయం 11.30 గం.కు మార్కుర్ పంప్ హౌస్ ప్రారంభించి రిజర్వాయర్ లోకి నీళ్ళు విడుదల చేశారు. 15TMC ల కెపాసిటీ ఈ రిజర్వాయర్ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దీని నుండి హైదరాబాద్ నగరాలకు కూడా తాగునీరు సరఫరా చేస్తారు. ఇందులో భాగంగా KCR తో కలిసి చిన్నజీయర్ స్వామి మార్కుర్ పంప్ హౌస్ ప్రారంభించారు. దీంతో గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతూ కొండ పోచమ్మ సాగర్లోకి చేరుతున్నాయి.

కొండ పోచమ్మ లోకి నీరు ఎలా వస్తుంది:

కొండ పోచమ్మ సాగర్ ను చేరేందుకు గోదావరి జలాలు దాదాపు 250 KM ప్రయాణిస్తాయి. 15TMC ల సామర్ధ్యం తో నిర్మించిన ఈ జలాశయం FRL  618 మీటర్లు. మేడిగడ్డ ఆనకట్ట ఎగువున కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద  88 మీటర్లు FRL నుంచి నీటిని ఎత్తి పోస్తున్నారు. ఆ తరువాత వివిధ దశల్లో అన్నరం, నంది మేడారం, గాయత్రి, అనంత సాగర్, రంగ నాయక సాగర్, మల్లన సాగర్, అద్దరం పంప్ హౌస్ లోని  పంపుల ద్వారా నీటిని ఎగువకు ఎత్తి పోస్తున్నారు. కొండ పోచమ్మ జలశేయం ద్వారా సిద్దిపేట జిల్లాలోని ఏడాది పొడువునా నోటితో కల కల ఆడుతోందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

మర్గుక్ లోని మోటార్లను ప్రారంభిస్తే నేరుగా కొండ పోచమ్మ  సాగర్ జలాశయం లోకి గోదావరి జలాలు వెళ్తాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇది 10 వ దశ ఎత్తి పోతల అవుతుంది. ప్రాజెక్టులో చివరి ఎత్తి పోత కూడా ఇదే మిగితా జలశేయాలు కలువ కు ఇక్కడి నుంచి  నీళ్లు గురుత్వాకర్షణ ద్వారానే వెల్లనున్నాయి. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఈ రిజర్వాయర్ చాలా ఎత్తైన ప్రాంతం.

KCR పేరుకు కొత్త నిర్వచనం:-

సీఎం కెసిఆర్ కు తన తనయుడు మంత్రి KTR  తండ్రి పేరు కి కొత్త నిర్వచనం చెప్పారు. K అంటే కాలువలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు అని కొనియాడారు. తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద  బహుళార్థ  సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందన్నారు.

 

రిజర్వాయర్ పూర్తి వివరాలు:-

సామర్ధ్యం : 15TMC లు

వ్యయం: రూ.1540 కోట్లు

వలయాకారం కట్ట: 15.8 కిలోమీటర్లు

ఆయ కట్టు: 2,85,280 ఎకరాలు

లబ్బి పొందనున్న జిల్లాలు: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి

ప్రధాన కాలువలు: రమాయం పేట, గజ్వేల్, ఉప్పర పల్లి, కృష్ణ పుర్, తుర్కపల్లి, జగదేవ్ పూర్, తురకపల్లి(M), శంకరపేట, సంగారెడ్డి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular