ఈ నెల 29 వరకూ తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు తెలంగాణా సీఎం కేసీఆర్ తెలియజేసారు. తెలంగాణ కేబినెట్ భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన రాత్రి 7 గంటల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన తెలియజేసారు. మరి కొన్ని రోజులు ఓపికతో ఉంటె ఇకపై మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా టెస్టింగ్ కిట్ల కొరత లేదని తెలియజేసారు. రెడ్‌జోన్ వంటి వాటిలో సిమెంట్, ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ మరియు స్టీల్ షాపులు వంటి అనుమతి సహా వ్యవసాయరంగ పనులు కూడా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.