శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeరాజకీయంఇంటి అద్దె అడగొద్దు ఇది విన్నపం కాదు నా ఆర్డర్..కేసీఆర్

ఇంటి అద్దె అడగొద్దు ఇది విన్నపం కాదు నా ఆర్డర్..కేసీఆర్

తాజాగా  దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు అమ‌లు అవుతుండటం మరోవైపు తెలంగాణా లో కరోనా కేసుల సంఖ్య ఘననీయంగా ఉండడంతో నిన్న కేసీఆర్ ఈ లాక్ డౌన్ మే నెల 7 వరకూ పొడిగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వారు అనగా ఆంద్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల ఉద్యోగస్తులతో పాటు సాదారణ జనం ఎక్కడివారు అక్కడే లాక్ అయిన నేపద్యంలో తమ వద్ద ఉన్న నెల జీతం డబ్బులు మొత్తం కాళీ అయ్యి నేడు చేతిలో రూపాయి లేక తినడానికి తిండిలేక పలు అవస్థలు పడుతునారు.

ఇలాంటి సమయంలో రూమ్ రెంట్స్ కి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయంపై తెలంగాణా ప్రభుత్వానికి పలువురు పిర్యాదులు చేయడంతో కేసీఆర్ ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహించి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పై కేబినేట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

కేబినేట్ నిర్ణయించిన దాని ప్రకారం ఇళ్ళ కిరాయి దారులు  మార్చ్, ఏప్రిల్, మే 3నెలల కిరాయిని ఇప్పుడు వసూలు చేయొద్దని చెప్పారు. ప్రస్తుతం వారి దగ్గర పని లేని కారణంగా డబ్బు లేదని అలాగని మొత్తంగా వసూలు చేయొద్దని కాదని, లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం వారు మళ్ళీ తమ పనులకు, ఉద్యోగాలకు వెళ్ళేంత వరకూ రెంట్ డబ్బులు అడగవద్దని అన్నారు. అంతేకాక ఈ మూడు నెలల అద్దెపై ఎలాంటి వడ్డీ వారికి విదించరాదని తెలిపారు.

తాను చెప్పీది అప్పీల్ కాదని డిజాస్టర్ మేనేజ్మేంట్ యాక్ట్ లో ఉన్న అధికారంతో చెబుతున్నానని ఇది నా రిక్వెస్ట్ కాదని ఇది నా ఆర్డర్ అని తెలిపారు. దీనిని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అలా పాటించకపోతే 100కి డైల్ చేసి చెబితే అలాంటి వారిపై చట్టపరమైన కటినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular