మంగళవారం, జూన్ 6, 2023
Homeసినిమాకత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం

కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం

సినీ, రాజకీయ విమర్శకుడు మరియు ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కత్తి మహేష్ కు నేడు కార్ యాక్సిడెంట్ జరగడంతో అతన్నివెంటనే నెల్లూరు లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యాక్సిడెంట్ నెల్లూరు జిల్లా కోడగాలూరు వద్ద హైవేపై వెళుతున్న లారీని వెనుకనుండి బలంగా డీ కొట్టడంతో కారు ముందు భాగం దారుణంగా డేమేజ్ అయ్యింది.  కారు వేగంగా లారీని డీకోట్టడంతో కత్తి మహేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి అయితే కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో  ప్రాణాపాయం నుండి బయటపడినట్లు తెలుస్తోంది.

ముందుగా చిన్న గాయలేనని అనుకున్నా పూర్తి స్థాయిలో వైద్యులు పరీక్షించిన తర్వాతా కళ్ళకు, ముక్కు మరియు తలకు గాయాలైనట్లు నిర్ధారించారు. అయితే కత్తి మహేష్ కి కంటి ఆపరేషన్ చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం డాక్టర్లు ఎలాంటి హెల్త్ బులిటన్విడుదల చేయకపోవడంతో ఆయనకు కొంచెం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై సోషల్మీడియాలో భిన్నాబిప్రాయలు తెరపైకి వస్తున్నాయి. కత్తి మహేష్ సన్నిహితులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తుంటే పూర్వం కత్తి మహేష్ శ్రీ రామునిపై దూషణలు చేసినందువల్లె ఆయనకీ ఈ పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు చేస్తున్నారు.         

RELATED ARTICLES

Most Popular