శనివారం, జూలై 27, 2024
Homeభక్తిఎవరి హయాంలో విగ్రహాలు మాయం అయ్యాయో చెప్పలేం..దుర్గ గుడి చైర్మన్

ఎవరి హయాంలో విగ్రహాలు మాయం అయ్యాయో చెప్పలేం..దుర్గ గుడి చైర్మన్

అంతర్వేది లక్ష్మి నరసింహస్వామి వారి రధం దగ్ధం మరియు స్వామివారి భూములు అన్యాక్రాంతం మొదలగు ఘటనలు మరవకముందే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని దుర్గా మల్లేశ్వర స్వామీ వారి వెండి రధానికి విరాళంగా నాలుగు సింహాలను అమిర్చిన వాటిలో ఇప్పుడు మూడు వెండి సింహాలు అదృశ్యమవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరిగుతున్న ఘటనలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

అయితే ఆలయ సిబ్బంది మాత్రం ఏమీ తెలియనట్లు అసలు అక్కడ వెండి సింహాల ప్రతిమలు ఉన్నాయా అన్నట్లు వాటిని ద్రువీకరించడానికి మూడు రోజుల సమయం కావాలని కోరడం మరింత విడ్డూరం. అయితే హిందూ దేవాలయాల పరిరక్షణలో బాగంగా పలు హిందూ సంస్థలు, టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు రాష్ట్రంలోని పలు దేవాలయాల రధాల పరిస్థితి తెలుసు కోవడం కోసం విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళడంతో అక్కడ నాలుగు సింహాలలో ఒక సింహమే ఉందని అదికూడా కాలును విరగోట్టినట్లు ఉందన్నారు బీజీపీ రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు.

మిగతా మూడు విగ్రహాలు సైతం విరగొట్టి తెసుకువేల్లిన ఆనవాల్లు అక్కడ కనిపిస్తున్నాయి.  రాష్ట్రంలో దేవాలయాల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎవరి హయాంలో విగ్రహాలు మాయం అయ్యాయో చెప్పలేం అంటూ ప్రభుత్వం కొత్త సింహాల విగ్రహాలను తయారు చేయిస్తామని తెలిపారు.

అయితే నిన్న కూడా తూర్పుగోదావరి జిల్లా ఎలేశ్వరంలో శివాలయం సమీపంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ద్వంసం చేసారు గుర్తు తెలియని దుండగులు.  రాష్ట్ర వ్యాప్తంగా గత కొంత కాలంగా హిందూ దేవాలయాలు, విగ్రహాలు,రధాలపై జరుగుతున్న దాడిని హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నారు. దేవాలయాలను  రక్షించలేకపోతే వాటి బాద్యతని తమకు వదిలీయాలని వాటిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని హిందూ సంఘాలు నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.      

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular