Thursday, September 17, 2020
Home రాజకీయం కరోనా సమయంలో కమల్ కుసంస్కారం నెటిజన్లు ఫైర్

కరోనా సమయంలో కమల్ కుసంస్కారం నెటిజన్లు ఫైర్

కరోనాపై అందరూ సిద్ధంగా ఉండాలని ప్రధాని పిలుపునివ్వడం భారత ప్రజలంతా దాన్ని పాటించడం జరుగుతోంది అన్ని రాష్ట్రాల సీఎం లు ప్రధాని లాక్ డౌన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాటలు చిచ్చురేపుతున్నాయ్.

ప్రధాని మోడీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం విఫలమైందని ఇది అచ్ఛం మోడీ నోట్లరద్దులా విఫలం అయిందని కమల్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కేవలం 4 గంటల వ్యవధిలో సుమారు 140 కోట్ల మంది ప్రజలను లాక్​డౌన్​కు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన మీకు 4 నెలల ముందే వైరస్​ సమాచారం ఉన్నా ఎందుకు అప్రమత్తమవ్వలేదని’ మోదీని ఉద్దేశించి కమల్ అన్నారు.

వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలని ఆకలితో ఎవరు పస్తులు పాడుకోరాదని అన్నారు కమల్..  దీనిపై అందరూ మండిపడుతున్నారు. దేశంతో పాటు ప్రపంచ మొత్తం కరోనామీద యుద్ధం చేస్తుంటే కమల్ హాసన్ దీన్ని రాజకీయం చెయ్యడం అతని కుసంస్కారానికి ఉదాహరణ అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి వణికిపోతే కమల్ రాజకీయం చేయడాన్ని  ప్రజలు చీదరించుకుంటున్నారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు . ఇది విమర్శించుకోవాల్సిన సమయం కాదని అందరం కలసిపోరాడాల్సిన సమయమని అంటున్నారు..

Leave a Reply

Most Popular