గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeరాజకీయంత్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారా ...!

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారా …!

గత ఎన్నికలలో ఒక్క ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకున్న జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో తన సత్తా చాటాలని చూస్తోంది. దీనిలో బాగంగానే రాజకీయంగా రాష్ట్రంలో మరింత  భలపడడానికి బీజేపీతో కలిసి కొత్త ప్రణాళికలను రచిస్తోంది. ఇక బీజేపీ విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఓటు శాతం చాలా తక్కువే అందుకే పవన్ కళ్యాణ్ ను ముందుంచి ఏపీలో బీజేపీ ఎలాగైనా నిలదొక్కుకోవాలని చూస్తోంది.

దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జడ్ ప్లస్ కేటగిరీ కల్పిస్తున్నామని బీజేపీ తెలపడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా పుంజుకుంటున్నాయి. సాదారణంగా అధికారంలో లేని వ్యక్తికి అంత సులువుగా జడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వరు మరియు తాజాగా ఈ మద్య కాలంలో పవన్ కళ్యాణ్ సైతం తనకు సెక్యూరిటీ కాలని కూడా కేంద్రాన్ని కోరిన దాకలాలూ లేవు.

అయితే తాజాగా బీజేపీ ప్రభుత్వం 2020 లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కార్యకర్తలను సిద్దంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే అయితే బీజీపీ మాత్రం ఏపీలో ఎలాగైనా పాగా వేయడానికి పవన్ కళ్యాణ్ చేత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయించడం ద్వారా జనసేన, బేజేపీ పార్టీలు ప్రజల్లోకి భలంగా వెళ్లాలని భావిస్తునట్లు తెలుస్తోంది.

ఇక ఆంద్రప్రదేశ్ లో ఒక రకంగా చెప్పుకోవాలంటే పాదయాత్ర చేసిన వారు ఎన్నికలలో ఓడిపోరనే నమ్మకం చాలా మంది నేతల్లో ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు, జగన్ వంటి వారు సైతం పాదయాత్రలు చేసి విజయం సాదించిన వారే తాజాగా ఈ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ కి కూడా వర్కవుట్ అవుతుందని అందుకే పాదయాత్రలో భాగంగా సెక్యురుటీ కల్పిస్తున్నారని తెలుస్తోంది.           

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular