జమ్మూ లోని ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయం పై డ్రోన్ దాడి | Jammu Airport Drone Attack

0
357
Jammu Airport Drone Attack
Jammu Airport Drone Attack

Jammu Airport Drone Attack

జమ్మూ లో ఉగ్రవాదుల దాడితో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  ఈ దాడి జమ్మూ లోని  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎయిర్ పోర్టులో ఉన్న  హ్యాంగర్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే రెండు బాంబులతో ఒకటి బయట పడగా ఇంకొకటి ఎయిర్ ఫోర్స్ కు చెందిన హ్యాంగర్ భవనం పై కప్పుపై పడడంతో స్లాబ్ కు పెద్ద రంద్రం ఏర్పడింది. 

దీనితో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆర్మీ సిబ్బంది ఈ దాడి ముందుగా నేలపై నుండి గ్రనేడ్ తో దాడి చేసిఉంటారని భావించారు. అయితే వేరే హ్యాంగర్ లో ఉన్న యుద్ధ విమానాలకు ఎటువంటి నష్టం జరగలేదు. అయితే  రెండో బాంబు స్లాబ్ పై పడడంతో ఇది డ్రోన్ తో చేసిన దాడిగా నిర్ధారణకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు దాడి జరిగిన ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ ఘటనలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే జమ్మూ ఎయిర్పోర్ట్ కు చెందిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే ఈఘటనను  ఉగ్రవాదులచేత చేయించింది మాత్రం పాకిస్థాన్ లెఫ్టినెంట్ జనరల్ షాహిద్ షంషాద్,  బ్రిగేడియర్ ఇర్ఫాన్ వెనుకనుండి మాస్టర్ ప్లాన్ వేసింది మాత్రం అతనేననే వార్త బలంగా వినిపిస్తుంది.

అయితే ఈ పని చేసిందిమాత్రం లష్కరే తోయిబా నేత హఫీజ్ సయ్యిద్ కు చెందిన ఉగ్రవాదులుగా చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే పాకిస్థాన్ హై అలర్ట్ ప్రకటించి వీటిలో ఎయిర్ బేస్, ఎల్.ఓ.సీ, లకు హై అలర్ట్ విధించింది. అయితే ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.