కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలను ఆధుకునెందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. సున్నా వడ్డీ పదకాన్ని వై.యస్ జగన్ ఈ రోజు మొదలుపెట్టారు. దీనికి సబందించి పలు డ్వాక్రా మహిళలతో జగన్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
అయితే ఈ కార్యక్రమం సీఎం క్యాంపుకార్యాలయం లో ప్రారంబించారు. అయితే మొత్తం 7.87 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఒక్క బటన్ తో సర్ప్, మెప్మా పరిదిలో గల గ్రామ, పట్టణ ప్రాంతాల ప్రజలకు 14 వందలకోట్లు సింగిల్ బటన్ ద్వారా విడుదల చేయనుంది.
దీనితో రాష్ట్రంలో మొత్తం 93 లక్షల మంది గృహిణులకు లబ్ది చేకూరనుంది. అయితే ఈ మొత్తం డబ్బు ఆన్ లైన్ ద్వారా బాంక్ లకు ట్రాన్స్ఫర్ చేయనుంది. అయితే ఈ పదకం జగన్ తన పాదయాత్రలో చెప్పిన హామీని నేడు నెరవేరుస్తున్నామని చెప్పారు.