మంగళవారం, జూన్ 18, 2024
Homeరాజకీయంకరోనా ఎవరికైనా వస్తుంది ఇది సహజం.. కరోనా పై జగన్ నిర్లక్ష్య వ్యాఖ్యలు

కరోనా ఎవరికైనా వస్తుంది ఇది సహజం.. కరోనా పై జగన్ నిర్లక్ష్య వ్యాఖ్యలు

ప్రస్తుతం ఏపీ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతుండడంతో నేడు సీఎం జగన్ మీడియా సమావేశంలో కీలక సూచనలతో పాటు కీలక వ్యాఖ్యలు కూడా చేసారు. ప్రస్తుత పరిస్థితి చూస్తె కరోనా పూర్తిగా నయమయ్యే అవకాసం కనిపించట్లేదన్నారు జగన్.

ఇది ఏదో మూల ఒక్కరికి ఉన్నా వారి నుండి మిగతా వారికి సోకడం వల్ల మనం ఎన్ని చేసినా ఈ కరోనాని కట్టడి చేయలేమన్నారు. రాభోవు రోజుల్లో కరోనాతో కలిసి నడవాలని ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. కరోనా అనేది భయంకర రోగం కాదన్నారు. ముందు ముందు కరోనా ప్రతీ ఒక్కరికీ వచ్చే చాన్స్ ఉందన్నారు. స్వైన్ ఫ్లూ, లాగే కరోనా కూడా ముందు వచ్చి తర్వాత నయమైపోతుందన్నారు.

అయితే నేడు సీఎం జగన్ మాట్లాడిన మాటలు కరోనాను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందని పలుమార్లు ప్రతిపక్షం చేసిన వాదనలు ఇప్పుడు నిజమే అన్నట్లుగా జగన్ వ్యవహరించారు. కరోనా అనేది తగ్గిపోయే అంటువ్యాధీ అయితే సుమారు 40 రోజులుగా ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టాల్సిన పనేంటి.

ఒక పక్క తెలంగాణా లో కేసులు తగ్గుతున్నా అక్కడ లాక్ డౌన్ కట్చితంగా పాటించాల్సిందేనంటూ కేసీఆర్ కుండబద్దలు కొట్టి చెప్పారు. ముందు జనం బ్రతకాలి ఆ తర్వాతే ఏ విషయమైనా అంటూ కరోనా తీవ్రత ప్రజలకు తెలియజేస్తుంటే తెలంగాణా లో కంటే అధికంగా ఉన్న ఆంద్రప్రదేశ్ లో మాత్రం కరోనాతో నడవాలి, కరోనా తో బ్రతకాలి అంటూ ప్రస్తుతం ఉన్న కరోనా తీవ్రతను అర్ధం చేసుకోకుండా ఒక సీఎం హోదాలో ఉండి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మన పనులు మనం చేసుకోవాలంటే అది రాష్ట ప్రజలను కోలుకోలేని స్థితికి తీసుకెళ్తుంది.

ప్రస్తుతం కరోనా కు ఎటువంటి వ్యాక్సిన్ గాని రాలేదు ఇలాంటి సమయంలో  ఇప్పటికే వ్యాక్సిన్ ఉన్న డెంగ్యూ, ఫ్లూ వంటి వాటితో వ్యాక్సిన్ లేని కరోనాతో పోల్చి అదే తగ్గిపోతుందని చెప్పడం జగన్ ప్రజల ప్రాణాలపై ఉన్న శ్రద్ద ఏపాటిదో అర్ధమౌతుంది. ప్రధానితో వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడినప్పుడు కూడా జగన్ లాక్ డౌన్ ఎత్తేయాలనే ఆలోచన తప్ప ఇంకేంమీ కనిపించట్లేదు.

కేంద్ర కరోనా పై ప్రతీ రాష్ట్రం పోరాటం చెయ్యాలని సూచించడానికి కారణం ఇప్పుడు దేశంలో ఉన్న కేసులు అదుపుచేయలేని స్థాయికి వెళితే వారికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు గాని తగు హాస్పటల్స్ గాని లేవు. అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలు కూడా ఇదే తరహాలో ఆలోచలన్తోనే ఇప్పుడు సెవాలు కూడా కప్పెట్టడానికి స్థలం కూడా లేక బాధపడుతున్న తరుణం.

ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా తీవ్రతను గుర్తించి ముందు ప్రజల ప్రాణాలకు బరోసా కల్పించాలి. ప్రజలకు కరోనా పట్ల దైర్యం చెప్పడంలో తప్పులేదు అయితే ఇప్పుడు మీరు చెప్పే ఆ దైరం ప్రజలకు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించే ప్రమాదం ఉంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular