రేపు అంతర్జాతీయ బాలికా దినోత్సవం.. కానీ ఇలాంటి రోజులన్నీ ఉత్సవాలకే పరిమితం కావడం మన దౌర్భాగ్యం సమాన హక్కులమాటదేవుడెరుగు ఇంట, బయట ఎక్కడకెళ్లినా కామంతో నిండిపోయిన ఈ దరిద్రపుగొట్టు సమాజాన్ని ఈదలేక తీరం దొరక్క దాంట్లో మునిగి అనవాళ్లు కూడా లేకుండా కనుముగైపోతున్న బాలికలెందరో ఆ భగవంతుడికేఎరుక… సిగ్గుచేటు… ఈ నాడు మానవ మృగాలు మాత్రం బుడిబుడి అడుగులేసే బుజ్జాయిలను కూడా కామవాంచకు బలితీసుకుంటున్నాయి..
అందుకే 1995లో బీజింగ్‌లో నిర్వహించిన భేటీలో మహిళలు, బాలికల హక్కుల కోసం ప్రపంచ దేశాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. బాలికల హక్కుల కోసం ఆమోదం పొందిన తొలి తీర్మానం ఇదే.
ప్రతీ ఏడాదీ అక్టోబర్ 11వ తారీకున అందరూ ఆనందంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని డిసెంబర్ 19వ తారీకు 2011వ సమత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ విషయాన్ని సూచించింది.