శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeజాతీయం135 కోట్ల మంది ప్రజలు సిపాయిల్లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీ

135 కోట్ల మంది ప్రజలు సిపాయిల్లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీ

కోరోనా ప్రభంజనం కొనసాగుతున్న నేపధ్యంలో దేశ ప్రజలు లాక్ డౌన్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారా అని సందిగ్దం లో ఉన్న తరుణంలో మోడీ దేశప్రజల గురించి మాట్లాడుతూ ప్రజల త్యాగాలు, మనో నిర్బరం చేత భారత్ ఇప్పటి దాకా కరోనా తీవ్రతను చాలా వరకూ తగ్గించగలిగామని అన్నారు.

దేశప్రజలు అందరూ తాము కష్టాల్లో ఉండి కూడా తమ దేశాన్ని కాపాడారని తెలిపారు. ప్రజలు పడుతున్న కస్టాలు నాకు తెలుసు.. కొందరు తిండి లేక బాధపడుతుంటే ఇంకొందరు ఊళ్లకు వెళ్ళలేక కష్టాలు అనుభవిస్తున్నారు. ఇంకొందరు ఇంటివారికి దూరంగా ఉండి వాళ్ళని కలవలేని పరిస్థితి. ఇలాంటి కస్టాలు ఉన్నా కూడా బోర్డర్ లో కాపలా కాసే సిపాయిలా దేశ ప్రజలు తమ దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు.

మనం ఎప్పుడూ వీర జవానుల గురించి మాట్లాడుతాం ఇప్పుడు మీరు కూడా వీర జవానులే అని కొనియాడారు. చాలా రోజుల నుండి ఇండి వద్దే ఉండి అందరినీ కాపాడే నిర్ణయం అనేది ఒక ప్రేరణ లాంటిదన్నారు. దేశంలో కరోనా కేసు ఒక్కటి కూడా లేనప్పుడే మన దేశంలో ఎయిర్ పోర్టులలో స్క్రీనింగ్ మొదలు పెట్టామన్నారు.

భారత్ లో 100 కేసులు రాగానే విదేశాలనుండి వచ్చే వారికి 14 రోజుల పాటు ఐసోలేషణ్ కచ్చితంగా పాటించాల్సిందిగా నిర్ణయ తీసుకున్నామన్నారు. మాల్స్, దియేటర్స్, జిమ్స్ వంటివి నిషేదించామన్నారు. దేశంలో 550 కేసులు వచ్చినప్పుడు 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేసామని చెప్పారు. తాము కరోనా సమస్య పెరిగేదాకా వేచి ఉండకుండా ఎక్కడ సమస్య కనిపిస్తే అదే సమయంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కొన్ని నిజాలను మనం ఒప్పుకోక తప్పదని ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అత్యదిక సామర్ధ్యం ఉన్నదేశాలతో పోల్చితే నేటికీ భారత్ చాలా మెరుగైన స్థితిలోనే ఉందని అన్నారు. 1 లేక 2నెలల క్రితం చాలా దీశాలు కరోనా ప్రభావం భారత దేశం తో సమానంగా ఉండేదని ఈ రోజు ఆ దేశాల్లో 25 నుండి 30రెట్లు అధికమయ్యాయని అన్నారు.

ఆయా దేశాల్లో వేళల్లో మృత్యు గోషలు  వినిపుస్తునాయని అన్నారు. మనదేశంలో కూడా లాక్ డౌన్ విధించక పోయినా, సోషల్ డిస్టెన్స్ లేకపోయినా తగిన సమయానికి త్వరగా నిర్ణయాలు తీసుకోకపోయినా ఈ రోజు భారత్ పరీస్థితి ఎలా ఉండేదాన్న ఆలోచనే ఏడుపు తన్ను కోస్తుందని అన్నారు. మనం తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయని లాక్ డౌన్ లో సోషల్ డిస్టెన్స్ చాలా ఉపయోగపడిందని అన్నారు.

ఆర్ధిక వ్యవస్థ దృష్టితో చూస్తె ఇది చాలా నష్టాలతో కూడిన విషయమని అన్నారు. నా దేశ ప్రజల ప్రాణాలతో పోలిస్తే ఇది అసలు పెద్ద విషయం కాదన్నారు. అయితే కరోనా తమ దేశం తో పాటు ఇతర దేశాల్లో విస్తరిస్తున్న ప్రభావాన్ని భట్టి పలు హెల్త్ ఎక్స్పర్ట్స్ లను, రాష్టాల గవర్నమెంట్ లను చాలా సార్లు చర్చలు జరిపి చివరకు లాక్ డౌన్ పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అన్ని చర్చలూ జరిపిన తరువాత లాక్ డౌన్ మే 3వ తారీకు వరకూ కొనసాగించి నట్లు తెలుపారు. పనులు చేసుకునే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని  ఏప్రిల్ 20 తరువాత కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం వారికి వెసులు బాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతేకాక కరోనాని అంత మొండించడానికి కొన్ని సప్తః పది నియమాలను తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular