మంగళవారం, మార్చి 19, 2024
Homeఅంతర్జాతీయంభారత నేవీ అమ్ములపోదిలోకి MH-60R మల్టీరోల్ అటాకింగ్ హెలికాఫ్టర్లు

భారత నేవీ అమ్ములపోదిలోకి MH-60R మల్టీరోల్ అటాకింగ్ హెలికాఫ్టర్లు

భారత రక్షణరంగంలో ప్రధాన పాత్ర వహిస్తున్న నేవీని మరింత పటిష్ట పరచాలనే ఉద్దేశ్యంతో 2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్ మరియు అమెరికా దేశాల మద్య రక్షణరంగ ఒప్పందంలో బాగంగా రోమియో MH-60R మల్టీరోల్ హెలికాఫ్టర్ల డీల్ కుదిరింది.

అయితే  వీటి వ్యయం 2.5 అరబ్ డాలర్లుగా తెలుస్తోంది. ఈ డీల్ లో ప్రధానంగా 24 రోమియో MH-60R మల్టీరోల్ హెలికాఫ్టర్ల డీల్ లో బాగంగా రెండు హెలికాఫ్టర్లను నేడు అందించిందని అమెరికాలో ఉన్న భారత రాయబారి తరన్ జీత్ సింగ్ సందు తెలిపారు.

దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కు చెందిన జలాంతర్గాములు, వార్ షిప్ ల ప్రాబల్యం మరింత పెరగటంతో బారత్ నేవీని మరింత బలపరుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ డీల్ బారత్ కు చాలా కీలకం కానుంది దీనికి కారణం అమెరికా నుండి కొనుగోలు చేసే హేలికాప్టర్లలో ప్రత్యేకమైన నిఘా వ్యవస్థతో పాటు రాత్రి వేళల్లో కూడా నిర్విరామంగా సేవలందిస్తాయి. అంతేకాక ఎలాంటి వాతావరనంలోనైనా వీటి పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇక సముద్రంలో దాక్కొని ఉన్న చైనా సబ్మెరైన్లను తరిమి తరిమి కొట్టే సత్తా వీటికుంది.

మిగతా హెలికాఫ్టర్లతో పోలిస్తే వీటిలో అత్యాధునిక టెక్నాలజీ తో రాడార్ వ్యవస్థతో పాటు ఈ హెలికాఫ్టర్లలో నుండి టార్పేడోలను, మిసైల్స్ లను మోసుకుపోయి వాటిని ఆకాశం నుండి ప్రయోగించే టెక్నాలజీ వీటిలో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పదిరెట్ల  సముద్రంపై నిఘా పెంచే అవకాసం ఉంటుంది. మొత్తం 24హెలికాఫ్టర్ లకు గాను మిగిలిన 22 హెలికాప్టర్లను 2023 చివరికల్లా పైలెట్ లకు ట్రైనింగ్ ఇచ్చి భారత్ కు అందివ్వనుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular