Indian Independence Day : నేడు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న భారతావని ప్రజల గుండెల్లో స్వాతంత్ర్య వేడుకల ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఒక వైపు స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటూనే మరోవైపు స్వాతంత్య యోధుల త్యాగాలను దేశం మొత్తం తలుచుకుముంది. బ్రిటీషువారి బానిస సంకెళ్ళతో తమ జీవితాలతో పాటు ప్రాణాలను కూడా అర్పించిన ఎందరో మహనీయులను భారతావని తలుచుకుంటుంది. మన దేశానికి వచ్చి వందల సంవత్సరాలు మన మీద అధికారం చెలాయిస్తున్న తరుణంలో అప్పట్లో ప్రతీ ఇంటిలో ఉన్న యువతకు దేశ భక్తి పెంపొంధించేవారు.
యువతతో పాటు దేశ స్వరాజ్య స్థాపనకు ప్రతీ గ్రామం నుండి వయస్సు మళ్ళిన వృద్దుల దాకా ఈ స్వాతంత్య ఉద్యమంలో పాల్గొని బ్రిటీషు వారిని మన దేశం నుండి వెళ్ళగొట్టి దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చారు. అప్పటి త్యాగమూర్తుల స్వాతంత్ర్య ఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్చాయుత జీవితం. నేటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో దేశ యువత ఆ త్యాగమూర్తులను ఆదర్షంగా తీసుకుని యువత గుండెల్లో జాతీయ భావాలు కలిగిన స్ఫూర్తి నింపి నేటి భారతావని ఎప్పటికీ దగద్ధమానంగా వెలిగిపోవాలని ఆకాంక్షిస్తూ ప్రతీఒక్కరికీ ప్రజావారధి తరపున 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (Indian Independence Day)
Read more..