శనివారం, ఫిబ్రవరి 4, 2023
Homeజాతీయంస్వాతంత్య్ర దినోత్సవం పై యువతపై కీలక వ్యాఖ్యలు చేసిన యోగీ ఆదిత్యనాథ్

స్వాతంత్య్ర దినోత్సవం పై యువతపై కీలక వ్యాఖ్యలు చేసిన యోగీ ఆదిత్యనాథ్

రేపు స్వాతంత్య్ర దినోత్సవం (Indian Independence Day) కారణంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీయం యోగీ ఆదిత్యనాథ్ దేశ యువతను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేసారు. యావత్ దేశం జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ద్వారా   యువకుల గుండెల్లో జాతీయతతో కూడిన స్ఫూర్తిని నింపుతుందని యోగీ అదిత్యనాద్ అన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం ప్రతీ సంవత్సరం జరుపుకోవడం వెనుక ఉన్న ఒక పెద్ద ఆలోచన దాగి ఉందని దేశానికి స్వాతంత్య్రం నాధనకు మన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అనేక త్యాగాల గురించి ప్రజలతో పాటు ముఖ్యంగా దేశ యువతకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం వళ్ల యువత మనస్సులో జాతీయతా భావాల్ని పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ నాయకులు జనంలోకి వెళ్లి చెప్పడం కంటే సామాజికంగానే ప్రజల ద్వారా దేశ యువతలో ఎక్కువ మార్పు తీసుకు వస్తుందన్నారు.

దేశంలో ఉన్న యువతరం మనదేశ భవిష్యత్తుతో పాటు మన దేశం కోశం జీవితాలను త్యాగం చేసి ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల చరిత్రను తెలుసుకోవాలన్నారు. మన దేశానికి అయువు పట్టు యువతే అంటూ దేశ అభివృద్దిలో యువత కీలక బాగస్వామ్యం కావాలన్నారు.

ఇవికూడా చదవండి…

RELATED ARTICLES

Most Popular