బుధవారం, జూలై 17, 2024
HomeజాతీయంBrahMos Supersonic Cruise Missile: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ పరీక్ష విజవంతం

BrahMos Supersonic Cruise Missile: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ పరీక్ష విజవంతం

BrahMos Supersonic Cruise Missile : భారత్ మరియు రష్యా దేశాలు డెవలప్ చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ (BrahMos Supersonic Cruise Missile) ను భారత్ మరోసారి పరీక్షించింది. ఇప్పటికే పదిరోజుల వ్యవధిలో రెండు సార్లు విజయవంతంగా పరీక్షించింది. ఇక తాజాగా పరీక్షించిన బ్రహ్మోస్ మిస్సైల్ ను ఒడిస్సా లోని బాలాసోర్ నుండి పరీక్షించగా ఇప్పటి వరకూ ప్రయోగించిన BrahMos మిస్సైల్స్ కి అప్ గ్రేడ్ వెర్షన్ BrahMos-ER మిసైల్ ను రంగంలోకి దింపింది DRDO.

ఇక ఈ మిస్సైల్ లో చాలా వరకూ స్వదేశీ పరిజ్ఞానంతో అప్గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది దీనిలో బాగంగా మిసైల్ కంట్రోల్ సిస్టం తో పాటు అత్యాదునిక స్వదేశీ రాడార్ ను కూడా పొందుపరిచారు ఇప్పటివరకూ ఉన్న బ్రహ్మోస్ మిసైల్స్ చాలా వరకూ రష్యా టెక్నాలజీ వాడుతున్న భారత్ BrahMos-ER వేరియంట్ మిసైల్స్ కు మాత్రం భారత్ హైటెక్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇక ఈ మిస్సైల్ రేంజ్ ను 800 కిలోమీటర్లకు పెంచింది డీఆర్ డీవో అంతేకాక ఈ మిస్సైల్ ను మేగ్జిమం స్పీడ్ తో లాంచ్ చేయడంతో ఈ మిసైల్ MACH 6.5 స్పీడ్ తో ప్రయాణించిందని రక్షణ రంగ నిపుణులు చెపుతున్నారు ఇదేనిజమైతే ఇక పాకిస్థాన్, చైనా లకు కంటి మీద కునుకుండదు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular