శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయంచైనా బోర్డర్ లో మోహరించిన నిర్భయ్ ... చైనా గుండెల్లో భయం

చైనా బోర్డర్ లో మోహరించిన నిర్భయ్ … చైనా గుండెల్లో భయం

భారత్ – చైనాల మధ్య బోర్డర్ లో నెలకొన్న యుద్దవాతావరణం మరింత ముదురుతుంది. ఇప్పటికే క్రింది స్థాయి ఆర్మీ అధికారులతో జరిగిన బేటీలో పలు దఫాల చర్చలు విఫలం అవ్వగా ఆర్మీ చీఫ్ తో జరిగిన సమావేశాలు కూడా విఫలం అయ్యాయి. తదుపరి రక్షణమంత్రి తో చైనా రక్షణ మంత్రి మద్య రష్యా లో జరిగిన సమావేశాలు సైతం పెద్దగా ఫలితం ఇవ్వలేదు.

దీనితో ఒక వైపు భారత్ మరోవైపు చైనా స్ట్రాటజిక్ పాయింట్లు అయిన ఫింగర్ 4వరకూ పర్వతాలను భారత్ తన అదీనంలోకి తీసుకుంది. దీనితో చైనా తన గాంభీర్యాన్ని బోర్డర్ లో ప్రదర్శిస్తూ భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేచ్తూనే మరోవైపు ఆర్మీ స్థావరాలను, యుద్ధవిమానాలు మరియు రష్యా నుంచి కొనుగోలు చేసిన S-300 మిస్సైల్ సిస్టం ను బోర్డర్ కు తరలించింది.

అంతే కాక చైనా ఎప్పుడూ తన ప్రపంచ నెంబర్ వన్ మిస్సైల్ అని చెప్పుకునే “డోంగ్ ఫ్యాంగ్” మిస్సైల్ రంగంలోకి దింపదంతో ఈ మిస్సైల్ ను ఎదుర్కోవడానికి భారత్ ఇప్పటికే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్ మిస్సైల్ ను మోహరించగా తాజాగా “నిర్భయ్”మిస్సైల్ ను చైనా బోర్డర్ లో మోహరించడంతో ఒక్కసారిగా పాకిస్థాన్, చైనా దేశాలకు ముచ్చెమటలు పడుతున్నాయి.

ఇక్కడ పాకిస్థాన్ ను ఈ అంశం లోకి తీసుకురావడానికి గల కారణం కూడా ఉంది. దీనికి ప్రదాన కారణం భారత్ నిర్భయ మిస్సైల్ రూపొందించే క్రమంలో పలు మార్లు విఫలం అయిన సమయంలో పాకిస్థాన్ మీడియాలో ఈ మిస్సైల్ ను దీపావళి ఆటవస్తువుగా చిత్రీకరించి ఎగతాళి చేసింది.

అలాగని భారత్ నిరాశ చెందలేదు ఓటమి నుండి పాటాలు నేర్చుకుని నిర్భయ మిస్సైల్ సరికొత్త టెక్నాలజీతో ఆదునీకరిస్తూ చివరికి 15 ఏప్రెల్ 2019 న  ఈ మిస్సైల్ టెస్ట్ నిర్వహించగా అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ ను చేదించింది.

తర్వాతా నిర్వహించిన పలు దఫాల టెస్ట్ లలో నిర్భయ భారత అమ్ములపొదిలో ఒక గేమ్ చేంజర్ గా మారింది. మొత్తం ఇప్పటివరకూ ఆరు పరీక్షలను నిర్వించారు. నేడు చైనా బోర్డర్ కి నిర్భయ మిస్సైల్ ను మోహరించడంతో పాకిస్థాన్ ను చెప్పుదెబ్బ కొట్టినటైంది.

 నికృష్టపు బుద్దితో భారత్ ను అపహాస్యం చేసిన పాకిస్థాన్ ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఇక నిర్భయ్ మిస్సైల్ విషయానికొస్తే ఇది ఒక సబ్ సోనిక్ క్రూస్ మిస్సైల్, దీనితో శత్రు స్థావరాలు, బంకర్లు, ఎత్తైన పర్వతాల వద్ద దాగివున్న టార్గెట్లను సైతం అత్యంత కశ్చితత్వంతో చేదిస్తుంది.

దీని మెరుగైన పని తీరుని గమనించిన శాస్త్రవేత్తలు ఈ మిస్సైల్ యొక్క స్పీడ్ వంటి అంశాలను రహస్యంగా ఉంచింది. అనదికారిక లెక్కల ప్రకారం దీని స్పీడ్ మాక్-3 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దీని రేంజ్ 1000 కిలోమీటర్లు ఇక ఈ మిస్సైల్ ను ఒక్క సారి ప్రయోగిస్తే అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల శత్రు రాడార్లు దీనిని గుర్తించడం చాలా కష్టం.     

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular