గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeఅంతర్జాతీయంభారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత..భారీగా ఇరు దేశాల సైన్యం మోహరింపు

భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత..భారీగా ఇరు దేశాల సైన్యం మోహరింపు

గత కొన్ని రోజుల నుండి భారత్ మరియు చైనా ల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొంటున్నాయి. అయితే తాజాగా కూడా చైనా ఆర్మీ తన  బలగాలను మరియు యుద్ద ట్యాంకులతో కూడిన అనేక క్యాంపు లను గాల్వాన్ లోయ, చుమార్ మరియు దౌలత్ బేగ్, ఆక్సాయ్ వంటి అనేక  ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మొహరించింది.

తాజాగా భారత్ తన శాటిలైట్లలో దీనిని గమనించిన భారత సైన్యం కూడా బోర్డర్ అలెర్ట్ టీం తో పాటు సైన్యాన్ని కూడా అక్కడ మోహరించింది. అయితే చైనా మాత్రం పాంగాంగ్ నదీ సమీపంలో ఆర్మీ గుడారాలతో పాటు నిర్మాణాలను ప్రారంబించడంతో భారత్ కు అనుమానం రావడంతో  ఆ ప్రాంతలో ఆర్మీ బలగాలను తరలించినట్లు తెలిపింది.

గడిచిన గత కొద్ది రోజులుగా చైనా ఆర్మీ కి చెందినా ఒక  హెలికాఫ్టర్ ఇండియా బోర్డర్ దగ్గర వరకూ వచ్చి  భారత్ కు చెందిన ఆయా ప్రాంతాల ఆర్మీ క్యాంపుల డేటా కలెక్ట్ చెయ్యాలనే ఉద్దేశంతో హెలికాఫ్టర్ రావడంతో అక్కడ భారత వాయుసేన రాడార్ కు  చిక్కడంతో వెంటనే రంగంలోకి దిగిన భారత వాయిసేనకు చెందిన సుకోయ్ యుద్ధవిమానాలు చైనా హెలికాఫ్టర్ ను వెంబడించడంతో అక్కడి నుండి  చైనా తోక ముడిచి తన భూబాగంలోకి వెళ్ళిపోయింది.

అయితే చైనా ఈ కవ్వింపు చర్యలకు ముఖ్య కారణం కరోనాను చైనా సృష్టించిందనే మంటతో పలు దేశాలు స్వతహాగా తమ పరిశ్రమ యూనిట్లను అక్కడినుండి బారత్ కు తరలించాలనే యోచనలో ఉండటంతో ఒకవిధంగా ఇది  చైనాకు మింగుడుపడటం లేదు.

ఎలాగైనా భారత్ లో ఉద్రిక్తతలు సృష్టిస్తే బయపడి పరిశ్రమలు తమ దేశం నుండి అక్కడికి తరలిపోవని చైనా బావిస్తోంది. అయితే ప్రస్తుతం భారత్ కు రావాలనుకునే కంపెనీలపై  సైతం చైనా బెదిరింపులు మొదలు పెట్టిందనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular