భారత్- చైనా ఘర్షణలో సుమారు 20 మంది భారతీయ జవాన్ల మృతి

0
301
india china
india china

భారత్- చైనా ఎల్ఓసీ  వద్ద  జరిగిన  ఘర్షణలో భారత్ జవాన్లు సుమారు 20 మంది వరకూ చనిపోయారనే  సమాచారం  ఇప్పుడు బయటకు రావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే ఇంతకు ముందు ముగ్గురు చనిపోయారని అధికారికంగా ప్రకటించిన ఆర్మీ అధికారులు ఇప్పుడు ఏకంగా 20 మందివరకూ  చనిపోయి ఉంటారని  వెల్లడించారు. వీరిలో 10 మంది జవాన్ల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయని మిగతా వారి మృత దేహాలు ఇంకా దొరకలేదని తెలిపారు.

అయితే భారత్ -చైనా జవాన్లు ఎత్తైన కొండపై ఘర్షణలకు దిగడంతో కొంత మంది రాళ్ళ దాడి చేత మరికొంత మంది ఘర్షణవల్ల లోయలో పడిపోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక చైనా వైపు కూడా సుమారు 40మంది వరకూ గాయాలైన వాళ్ళు మరియు చనిపోయిన వాళ్ళు ఉంటారని తెలుస్తోంది. అయితే చైనా నుండి ఇప్పటివరకూ ఎటువంతో అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే చైనా ఆర్మీ భారత్ జవాన్లపై  రాళ్ళ దాడితో పాటు కర్రలకు ఫెన్సింగ్ వైర్ చుట్టిన ఆయుధాలతో దాడి చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చైనా విదేశీ శాఖామంత్రి భారత్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. భారత్ ఆర్మీ మా భూభాగంలోకి అక్రమంగా చొరబడిందంటూ అందుకే ఈ ఘర్షణలు నెలకొన్నాయని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

Read also….