శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయంచినూక్ వచ్చింది ...ఇక చైనా చచ్చింది

చినూక్ వచ్చింది …ఇక చైనా చచ్చింది

గత కొద్ది రోజులుగా భారత్ మరియు చైనా సరిహద్దుల్లో  ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే దీనితో భారత్-చైనా రెండు దేశాల మద్య ఒక రకంగా యుద్ద వాతావరణమే కొనసాగుతుంది. ఇక చైనా ఒక అడుగు ముందుకేస్తే మన భారత్ మాత్రం ఐదు అడుగులు ముందుకేసి ఇక చైనా సంగతి అటో ఇటో తేల్చుకోవాలని భావిస్తోంది.

దీనిలో బాగంగానే లద్దాక్ లోకి భారత్ లో  ఉన్న అతి  శక్తీవంతమైన పారా మౌంట్ దళాన్ని చైనా బోర్డర్ సమీపానికి  దింపింది. ఈ దళాన్ని చూస్తేనే చైనా వెన్నులోంచి వొనుకు పుట్టడం కాయం. అత్యంత తక్కువ సమయంలో రాత్రీ, పగలూ అనే తేడా లేకుండా ఎలాంటి దాడుల నైనా తిప్పికోట్టగల సామర్ధ్యం ఈ దళానికుంది. చైనా ఎప్పుడూ నక్కజిత్తుల తెలివి తేటలను ప్రదర్శిస్తూ ఉంటుంది.

పొరుగు దేశం ఏ మాత్రం ఆదమరచి ఉన్నా లేక బలహీనంగా ఉన్నా ఆ దేశ భూబాగంలోకి చొచ్చుకొచ్చి అక్కడ చైనా టెంట్లు వేసి అది తమదేనని వాదిస్తుంది. మౌనంగా ఉంటెమాత్రం ఆ దేశ భూబాగాన్నిఆక్రమించుకుంటుంది. ఇప్పుడు జరిగింది కూడా ఇదే అయితే ఇక్కడ ఉన్నది మాత్రం భారత్ భారతదేశం ఇటు సైన్యం పరంగానూ అటు దౌత్య పరంగానూ చైనా కు భారత్ గట్టిగానే  బదులివ్వడంతో చైనా తోకముడిచి రెండు రోజుల క్రితం కొద్దిగా వెనక్కి తగ్గినట్లు తగ్గి మరలా చైనా బోర్డర్ లో ఉన్న  పర్వతాల వెనక వైపు భారీగా ఆర్టిలరీ మరియు బెటాలియన్స్ ను  సిద్దం చేస్తున్నట్లు భారత శాటిలైట్ చిత్రాల్లో వెలుగులోకి వచ్చింది.

దీనితో భారత్ సైతం చైనా కు దీటుగా రంగంలోకి దిగింది. అయితే రెండు రోజుల క్రితం నుండి భారత్ లెఫ్టినెంట్ జెనరల్  లద్దాక్ పరిస్థితులను తెలుసుకున్న ఆయన చైనా ప్రతీసారి చిరాకు పెడుతుంది ఈ సారి ఎదో ఒకటి తెల్చేయాలంటూ  చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

అయితే భారత్ మాత్రం చైనా వైపు నుండి  ఎటువంటి ఎదురుదాడి నైనా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో  ముందుగానే సమాయత్తం అవుతుంది. దీనిలో భాగంగానే అమెరికా నుండి 2015 లో చినూక్ సీహెచ్ 47 హేలికాఫ్టర్స్ డీల్  పై సంతకం చేసిన ఇండియా కు ప్రస్తుతం అవి  చేరుకున్నాయి. వీటి రాకతో భారత ఆర్మీ కి పదిరెట్లు  బలం వచ్చి చేరినట్లయంది.

చినూక్ హెలికాఫ్టర్ ప్రత్యేకతలు:

రక్షణశాఖ   ప్రదానంగా వీటిని  ఆర్డర్ చేయడానికి గల ముఖ్య కారణం జవాన్లను అతి తక్కువ సమయంలోనే భారత సరిహద్దులకు చేర్చడం ఒక్కొక్క దానీలో  మొత్తం ముగ్గురు సిబ్బంది ఉంటారు. వీరిలో  పైలెట్, కో పైలెట్, ఫ్లైట్ ఇంజనీర్ దీనిలో ప్రయాణిస్తారు. దీని కెపాసిటీ విషయానికి వస్తే సుమారు 55 మంది జవాన్లను అవలీలగా తీసుకు వెళ్ళగలదు.

వీటితో పాటు 10,886 కేజీల భారువు గల ఆయుధాలను అనగా ట్రక్, సామాగ్రీ సైతం సునాయాసంగా తీసుకు వెళ్తుంది. ఇంత ఎక్కువ భారువుతో  కూడా 22 వేల అడుగుల ఎత్తు వరకూ ప్రయానిస్తుంది. సియాచిన్ వంటి అత్యంత ఎత్తు, మంచు కలిగిన ప్రదేశాలలో సైతం దీని సేవలు అమోఘం. ఈ చినూక్ విమానాలు  గంటకి 300కిలో మీటర్ల స్పీడ్ తో ప్రయాణించగలవు.

చినూక్ హెలికాఫ్టర్ వెయిట్ లిఫ్టర్ గా మాత్రమె కాదు ప్రయాణాలలో  ఎలాంటి శత్రు దాడులనైనా దీటుగా తిప్పి కొట్టడానికి దీనిలో మొత్తం 8 మెషీన్ గన్స్ అమర్చబడి ఉంటాయి. ఇవి 7.62 ఎంఎం హెవీ ఫైరింగ్ మెషీన్ గన్స్ తో పాటుగా హెలికాఫ్టర్ కి ప్రక్కన  రెండు విపులా రాకెట్ లాంచర్స్ అమర్చబడి ఉంటాయి. వీటిలో మొత్తం 38 రాకెట్ లను తీసుకెళ్తుంది. వీటితో పాటు  పాటు గ్రనేడ్ లాంచర్ సైతం అమర్చబడి ఉంటుంది దీనిని పైలెట్  లాంచ్ చేసే విదంగా రూపొందించారు.

ప్రస్తుతం ఈ చినూక్ హెలికాఫ్టర్ లను  చైనా బోర్డర్ కి తరలించారు. భారత్ లో చైనా బోర్డర్ ఉన్న అనేక ప్రదేశాలలో సరైన రోడ్లు, వంతెనలు లేవు. మోడీ సర్కార్ గద్దెనెక్కిన నాటినుండీ బోర్డర్ లోని రోడ్లు మరియు వంతెనల పనులపై ద్రుష్టి సారించడంతో చాలా వరకూ పనులు పూర్తికావచ్చాయి.

చైనా బోర్డర్ లో మరిన్ని పనులు ఇప్పుడు వేగంగా జరుగుతుండడంతో జవాన్లను మరియు యుద్ద సామాగ్రీ బోర్డర్ కు చేరవేయడానికి చినూక్  భాగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం చైనా తోక జాడించే చర్యలకు దిగితే భారత్ మాత్రం  ధనుష్ వంటి  అత్యంత శక్తివంతమైన ఆర్టిలరీగన్స్ ను ఈ హేలీకాఫ్టర్స్ సాయంతో బోర్డర్ కు తక్తకువ సమయంలో తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.          

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular