మంగళవారం, జూన్ 25, 2024
Homeక్రీడలుInd vs AUS Live Score Update: భారత్ ను నిలబెట్టిన కోహ్లీ, రాహుల్

Ind vs AUS Live Score Update: భారత్ ను నిలబెట్టిన కోహ్లీ, రాహుల్

Ind vs AUS Live Score Update :

World Cup లో బాగంగా భారత్ మొదటి మ్యాచ్ నేడు ఆస్ట్రేలియాతో తలపడుతోంది అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు మొదటి వికెట్ మార్స్ 0 (6) ను పెవీలియన్ కు పంపి ఆస్ట్రేలియా టీం ను ఆదిలోనే ప్రెజర్ క్రియేట్ చేసారు.

అయితే కొంత సేపు నిలకడగా ఆడిన డేవిడ్ వార్నర్ 52 బంతుల్లో 41 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయాడు. తరువాత వచ్చిన స్మిత్ కొంత సేపు స్కోరు బోర్డు పెంచినా 46 (71) తో బుమ్రా బౌలింగ్ లో కోహ్లీ కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

ఆస్ట్రేలియా టీం లో హైయెస్ట్ స్కోర్ చేసింది వీరిద్దరే. ఇక భారత్ బౌలర్ల ధాటికి 49.3 ఓవర్లకి 199రన్స్ చేసి ఆస్ట్రేలియా ఆలౌటయ్యారు. భారత్ బౌలింగ్ లో అత్యధికంగా రవీంద్ర జడేజా 10 ఓవర్లు వేసి 3 వికెట్లు తియ్యగా బుమ్రా-2, సిరాజ్ -1, హార్దిక్ పాండ్యా-1, అశ్విన్-1, కుల్దీప్ -2 వికెట్లు తీసి భారత్ బౌలింగ్ సత్తా చాటారు.

India Batting

199 పరుగుల టార్గట్ తో బ్యాటింగ్ లోకి దిగిన భారత్ ఆదిలోనే ఆస్త్రీలియా బౌలర్లు ధాటికి మూడు వికెట్లు కోల్పోయారు. రోహిత్ శర్మ 6బంతుల్లో 0, ఇషాన్ కిషన్ డెక్, శ్రేయస్ అయ్యర్ 3 బంతుల్లో 0 తో భారత్ టాప్ ఆర్డర్ ను ఆస్ట్రేలియా బౌలర్లు పెవీలియన్ కు పంపించారు.

అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ కు కే యల్ రాహుల్ మరియు విరాట్ కోహ్లీ లు నాల్గవ వికెట్ కోల్పోకుండా అద్భుతమైన బాగాస్వామ్యంతో 158/3 పరుగులు చేసారు వీరిలో కే యల్ రాహుల్ 97 బంతుల్లో 70 పరుగులు చెయ్యగా విరాట్ కోహ్లీ 109 బంతుల్లో 81 పరుగులు చేసి నిలకడగా రాణిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular