ఇక ఆ జిల్లాలో రోడ్లపైకి వస్తే… కరోనా టెస్ట్!

0
163
కరోనా
కరోనా

పోలీస్ హెచ్చరికలు …లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి తిరుగుతున్న ఆకతాయిలకు రకరకాల పద్ధతుల్లో శిక్షలు శ్రీకాళహస్తిపట్టణంలో కరోనా మహమ్మారి పట్టణ ప్రజలను అతలాకుతలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాళహస్తి పట్టణాన్ని 24 గంటల లాక్ డౌన్ విధించారు.

పోలీసులు ప్రజల ఆరోగ్యం కోసం రాత్రీపగలూ కష్టపడుతుంటే కొంతమంది ఆకతాయిలు లాక్ డౌన్ పాటించకుండా వీధుల్లో సవైరవిహారం చేస్తున్నారు. ఈనేపథ్యంలో అలాంటి ఆకతాయిల ఆట కట్టించడానికి ఒక కొత్త పద్ధతి చేపట్టారు అక్కడి పోలీసులు.

ఇష్టమొచ్చినట్టు బాధ్యతలేకుండా రోడ్లపై తిరిగే వాళ్ళ అంతుచూడటానికి కొత్తపద్ధతి చేపట్టారు రోడ్ మీదకు వచ్చినవాళ్ళను 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ కి తరలించి అక్కడ కరోనా పరీక్షలు చేసి తిరిగివాళ్ళను ఇంటి వద్ద వదిలేస్తున్నారట. అంతటితో కథ అయిపోలేదు అలా టెస్టులు చేసి వదిలిన తర్వాత ఇంకోసారి రోడ్లమీద కనిపిస్తే కేసులునమోదుచేస్తామంటూ ఆకతాయిలకు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.