ఆదివారం, మే 26, 2024
Homeజాతీయంఅవి అత్యధికంగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన హైదరాబాద్ వాసులు

అవి అత్యధికంగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన హైదరాబాద్ వాసులు

కరోనా ఎఫెక్ట్ తో ప్రజలంతా ఇంటిపట్టునే కాలక్షేపం చేస్తున్నారు దీనితో మన దేశంలో కొన్ని నగరాల్లో గత కొద్ది రోజులుగా ఇదివరకు కన్నా ఇప్పుడు గర్బనిరోధక మాత్రలు, సానిటైజర్లు, కన్డోములు విపరీతంగా వాడేస్తునారు. ఈ విషయం ఎలా తెలుసనుకుంటున్నారా ప్రముఖ ఆన్లైన్ ఆప్ “డుంజో” ( Dunzo)  కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

డుంజో బయటపెట్టిన నగరాల్లో మన భాగ్యనగరం హైదరాబాద్ కూడా ఉంది. గర్బనిరోధక మాత్రలు ( i-pill) అత్యధికంగా ఆర్డర్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. సానిటైజర్లు ఎక్కువగా ఆర్డర్ చేసిన నగరంగా చెన్నై నిలవగా ఎక్కువ కన్డోములు ఆర్డర్ చేసిన నగరంగా ముంబై నిలిచింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూత పడగా మెడికల్ షాపులు మాత్రమే అనుమతిస్తున్నారు.

అయితే కొన్ని మెడికేర్ వస్తువులు ఇంటివద్దకే తక్కువ టైములో డెలివరీ చేస్తుండడంతో సామాన్య ప్రజలు కన్డోములు, గర్భనిరోధక మాత్రలు తీసుకోవాలంటే మెడికల్ షాప్ దగ్గర సిగ్గుతో కూడుకున్న విషయం అందుకే “డుంజో” లాంటి ఆన్లైన్ యాప్స్ ద్వారా కావాల్సిన్నన్ని ఇంటికే తెప్పించుకుంటున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కన్డోములు విపరీతంగా వాడుతుండడంతో ఇప్పుడు కన్డోముల కొరత అధికంగా ఉంది. కరోనా ఎఫెక్ట్ తో పలు కన్డోముల కంపెనీలు మూతపడ్డాయి. అయితే కన్డోముల కొరత తీవ్రమవడంతో మలేషియాకు చెందిన ఒక కంపెనీ ఈ సమయంలో కూడా తెరిచేందుకు అనుమతి తీసుకుని మళ్ళీ తిరిగి కన్దోముల తయారీ ప్రారంబించిందంటే ఏ  స్థాయిలో కొరత ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular