శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయం24 గంటల్లో 5లక్షల ఒమిక్రాన్ కేసులు ... తీవ్ర రూపం దాలుస్తున్న ఒమిక్రాన్ వైరెస్

24 గంటల్లో 5లక్షల ఒమిక్రాన్ కేసులు … తీవ్ర రూపం దాలుస్తున్న ఒమిక్రాన్ వైరెస్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించిన ఈ ఒమిక్రాన్ వైరెస్ తాజాగా అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మొన్నటిదాకా రోజుకి సుమారు పది నుండి పదిహేను వేల మద్యలో వచ్చే కేసులు ఈ నెల 29వ తేదీ ఒక్క రోజే ఏకంగా 5 లక్షల 25 వేలకు కేసుల సంఖ్య పెరగడంతో అదికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఇప్పటికే అనేక దేశాల నుండి అమెరికాకు వచ్చే వారిలో ఒమిక్రాన్ వైరెస్ ఉన్న వారు అధికంగా ఉండడంతో వారిని ఐషోలేషన్ కు తరలిస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఒక్క రోజులో ఇంత అధిక స్థాయిలో కరోనా సమయంలో కూడా ఇన్ని కేసులు నమోదు అవ్వలేదంటే ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అమెరికాలో కరోనా తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సినేషన్ పై కొంచే నిర్లక్షం వహించిన అక్కడి ప్రజలు తాజాగా ఒమిక్రాన్ ఒక్కసారిగా భారిగా పెరగడంతో ఇప్పుడు అక్కడి ప్రజలు వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు భారీగా క్యూకడుతున్నారు.

అమెరికా వ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో Omicron కేసులు పెరుగుదలకు ప్రధాన కారణం క్రిష్మస్ వేడుకలు అమెరికాలో జరిగే క్రిష్మస్ వేడుకలకు ఇతర దేశాల నుండి భారీగా తరలి వస్తుంటారు ఇప్పుడు ఇదే పెద్ద తల నొప్పిగా మారింది.

రేపు రాభోయే నూతన సంవత్సర వేడుకలను ఎలా కంట్రోల్ చెయ్యాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇక భారత్ లోనూ ఈ వైరెస్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోన్న తరుణంలో ముంభై, డిల్లీ, వంటి నగరాల్లో పలు ఆంక్షలు పట్టడం జరిగింది.     

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular