శనివారం, మే 18, 2024
Homeహెల్త్టమోటాలు తినడం వల్ల కిడ్నీ లో రాళ్లకు కారణమవుతుందా? నిజం బయటపడింది.

టమోటాలు తినడం వల్ల కిడ్నీ లో రాళ్లకు కారణమవుతుందా? నిజం బయటపడింది.

టమోటా అంటే  తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ వీటిని వాళ్ళు తినే వంటలో  తప్పక వేసి వండుతుంటారు. టమోటో మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. దీన్ని ఎటువంటి వంటకాలలో వేసినా దాని రుచి మనకు తెలుస్తుంది.

టమోటాలనుంచి మనకు మంచి విటమిన్ సి, విటమిన్ ఏ, పోటాషియం మరియు ఫైబర్స్ ని  కూడా కలిగి ఉంటాయి. అయితే  అందరూ టమోటాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయని నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.

టమోటాలు – కిడ్నీ లో రాళ్లు.

కిడ్నీలలో అనేక రకాలైన రాళ్లు ఉంటాయి. అందులో సర్వ సాధారణమైనవి క్యాల్షియం రాళ్ళు కూడా ఒకటి. మన కిడ్నీ లో  కాల్షియం ఆక్సలేట్ నిక్షేపించడం ద్వారా ఈ రాళ్ళు తయారవుతాయి. ఆక్సలేట్ అనేది మన శరీరంలో  సహజంగా లభించే ఒక  పదార్థం, ఇది వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లలో నుండి లభిస్తుంది.

అంతేకాక, మన లివర్ కూడా ప్రతీ రోజూ కొంత మొత్తంలో కాల్షియం ఉత్పత్తి చేస్తుంది. మన ఎముకలు మరియు కండరాలు వంటివి రక్తం నుండి కాల్షియంను గ్రహిస్తాయి, అయితే ఈ పోషక పరిమాణం రక్తంలో ఎక్కువశాతం అయినప్పుడు అది కిడ్నీల ద్వారా  బయటకు పోతుంది.

కొన్ని సార్లు కిడ్నీలు శరీరం నుండి అదనపు కాల్షియంను బయటికి విసర్జించలేకపోవడం వాళ్ళ ఇది క్రమంగా ఆ ప్రాంతంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అంతేకాక రాళ్ళ ఆకారాన్ని తీసుకుంటుంది. టొమాటోస్ ఎక్కువ మొత్తంలో ఆక్సలేట్ కలిగి ఉండడంచేత  మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి.

అసలు నిజమెంటో  తెలుసుకుందాం.

టమాటా లలో ఆక్సలేట్ ఉంటుంది కానీ దీని మొత్తం చాలా తక్కువగా పరిమాణంలో ఉంటుంది. మరియు ఇది కిడ్నీలో రాయి ఏర్పడటానికి దారితీయదు. 100 గ్రాముల టమోటాలలో 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. టమోటాల వళ్ళ చాలా హానికరం అయితే కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వ్యక్తులు దాని వినియోగాన్ని పూర్తిగా ఆపివేయడం ఉత్తమం.

మీరు  ఆరోగ్యంగా ఉండి ఎటువంటి కిడ్నీ సమస్యలు లేకపోతే మీకు నచ్చినంతగా టమోటాలు తీసుకోవడం మంచిదే. ఒకవేళ మీరు కిడ్నీలకు సంబంధించిన కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే మీరు టమోటోలలో ఉండే ఆక్సలేట్ తీసుకోవడం మానేయండి. అంతేకాక బచ్చలికూర, బీన్స్, బీట్‌రూట్‌లో సైతం ఎక్కువ మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. తినడానికి ముందు ఈ కూరగాయలను సరిగ్గా ఉడికించాలి.

మూత్రపిండాల్లో రాళ్లను నివారించగల విషయాలు.    

ప్రతీ రోజూ కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలి అందులోనూ ఉదయంపూట రాగి వస్తువులో నీరు తాగడం చాలా ఉత్తమం. ఇది మీ కిడ్నీ మరియు శరీరంలోనుండి మలినాల్ని బయటకు తీయడానికి సహాయపడుతుంది. మీరు సోడియం తీసుకోవడం తగ్గించాలీ. మీ ఆహారంలో ప్రోటీన్ కంటెంట్  ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి. మీ వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు.

ఇక చివరిగా కిడ్నీ సమస్యలు లేని వాళ్ళు టొమాటోలను వారి ఆహారంలో బాగంగా వాడుకోవచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు మాత్రం దాని వినియోగం తగ్గించుకోవడం ఉత్తమం.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular