హైకోర్టులో విజయసాయి రెడ్డికి చుక్కెదురు…ఇకపై కేసుల విచారణ

0
960
vijayasai reddy
vijayasai reddy

అక్రమాస్తుల కేసులో A-2 గా ఉన్న విజయసాయి రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసుల విచారణ కొనసాగుతుండడంతో మొదటగా విజయసాయిరెడ్డి పై ఉన్న ఈడీ కేసులను విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో విజయసాయి రెడ్డి పిటిషన్ దాకలు చేసారు అయితే విజయసాయి రెడ్డి దాకలు చేసిన పిటిషన్ లో మొదట సీబీఐ కేసులు విచారించిన తరువాత ఈడీ కేసుల విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టుని కోరారు.

అయితే మొత్తం వాదనలు విన్న హైకోర్టు ఇప్పుడు మొదట ఈడీ కేసులు విచారిస్తే మీకేమైనా అబ్యంతరమా అని కోర్టు ప్రశ్నించగా ముందుగా సీబీఐ విచారణ జరిగితే ఆవిచారణలో నిర్దోషిగా బయట పడితే తరువాత ఈడీ కేసులు నిలబడవు కావున మొదట మొదట సీబీఐ కేసులు విచారణ జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుని కోరారు.

అయితే సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఈడీ విచారణ పూర్తైన కారణంగా పిటిషనర్ వాదనలతో ఏకీభవించవద్దంటూ సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్ కు సంబంధించి వాదనలు విన్న హైకోర్టు విజయసాయి రెడ్డి వేసిన పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదిలా ఉండగా బెయిల్ పై ఉన్న విజయసాయి రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంగించారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కోర్టులో ఫిటిషన్ దాకలు చెయ్యగా దానిని స్వీకరించిన కోర్టు విజయసాయి రెడ్డి కి నోటీసులు అందజేసింది అయితే ఈ నోటీసులపై విజయసాయిరెడ్డి స్పందించకపోవడంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది కౌంటర్ దాకలుకు మరింత గడువు కావాలని కోరగా కోర్టు ఈనెల 13వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి…గోదావరి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో బీడు వారిన పంట పొలాలు.. రైతన్న కన్నీరు

త్వరలో జగన్ ప్రభుత్వానికి మరో ఘులక్ ఇవ్వనున్న రఘురామకృష్ణ రాజు

                              అమరావతి సమరానికి 600రోజులు …మళ్ళీ ఉవ్వేత్తున ఎగసిన ఉద్యమం

SR Kalyana Mandapam Review | ఎస్.ఆర్. కళ్యాణ మండపం మూవీ రివ్యూ